ETV Bharat / business

ఫ్లిప్​కార్ట్, అమెజాన్​ పోటాపోటీ ఆఫర్లు- బెస్ట్​ డీల్స్ ఇవే.. - టీవీలపై ఫ్లిప్​కార్ట్ ఆఫర్లు

దేశంలో పండుగ సీజన్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఫ్లిప్​కార్ట్(Flipkart Big Billion Days)​, అమెజాన్​ (Amazon Great Indian Festival Sale) ప్రత్యేక సేల్స్ ప్రారంభించాయి. స్మార్ట్​ఫోన్లు, స్మార్ట్​ టీవీలతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై భారీ డిస్కౌంట్​ ఇస్తున్నాయి. ఈ ఆఫర్లకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

Flipkart, Amazon sales
ఫ్లిప్​కార్ట్​, అమెజాన్​ సేల్స్​
author img

By

Published : Oct 3, 2021, 2:13 PM IST

దేశీయ ఈ-కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్​కార్ట్​, అమెజాన్​ పోటా పోటీగా పండుగ సీజన్ ప్రత్యేక సేల్స్​ ప్రారంభించాయి. ఫ్లిప్​కార్ట్​ బిగ్​ బిలియన్ డేస్(Flipkart Big Billion Days), అమెజాన్ గ్రేట్​ ఇండియా ఫెస్టివల్ (Amazon Great Indian Festival Sale)​ సేల్స్​​ ఆదివారం నుంచి సాధారణ యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చాయి.

ఫ్లిప్​కార్ట్​ ప్లస్, అమెజాన్​ ప్రైమ్​ యూజర్లకు ఒక రోజు ముందుగానే.. అంటే అక్టోబర్ 2 నుంచే ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మరి ఈ సారి పండుగ డీల్స్​ (Festival offers) ఎలా ఉన్నాయి? ఫ్లిప్​కార్ట్​, అమజాన్​ ఇస్తున్న ఎక్స్​క్లూజివ్ ఆఫర్లు ఏమిటి? అనే పూర్తి వివరాలు మీ కోసం.

మొబైల్ ఫోన్లపై ఫ్లిప్​కార్ట్ అదిరే ఆఫర్లు..

ఐఫోన్లపై డిస్కౌంట్ల బొనాంజా ప్రకటించింది ఫ్లిప్​కార్ట్ (Flipkart festival offers)​. ఐఫోన్ 12 ధరను (iPhone offers on Flipkart) రూ.49,999కు తగ్గించింది. ఐఫోన్ 12 మినీ ధరను రూ.38,999గా నిర్ణయించింది. ఇక బడ్జెట్​ ఐఫోన్ ఎస్​ఈ (2020) ధరను రూ.26,999కి తగ్గించింది.

గూగుల్​ పిక్సెల్​ 4ఏ స్మార్ట్​ఫోన్​ ధరను రూ.31,999 నుంచి రూ.25,999కి తగ్గించింది ఫ్లిప్​కార్ట్​. దీనితో పాటు గూగుల్ బడ్స్​పై 50 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది.

శాంసంగ్​ ఎఫ్62 ధరను ఏకంగా రూ.11,000 తగ్గించింది. ఆఫర్ తర్వాత ఈ ఫోన్ ధర రూ.18,999కు దిగొచ్చింది.

బడ్జెట్ స్మార్ట్​ఫోన్ ఎఫ్​22 ధరను రూ.14,999 నుంచి రూ.12,499కి తగ్గించింది.

ఫోన్లతోపాటు టీవీలు, ఫ్రిడ్జ్​లు ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై భారీ తగ్గింపు ఇస్తోంది ఫ్లిప్​కార్ట్​.

సేల్ డిస్కౌంట్లతో పాటు.. యాక్సిస్​ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్​, డెబిట్​ కార్డ్​ల ద్వారా చెల్లింపులు జరిపితే అదనంగా మరో 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభించనుందని ఫ్లిప్​కార్ట్​ తెలిపింది. పేటీఎం ద్వారా చెల్లింపులు జరిపితే రూ.200 వరకు డిస్కౌంట్ లభించనుందని వెల్లడించింది.

last date for Flipkart big billon days sale
ఈ నెల 10 వరకు ఫ్లిప్​కార్ట్ సేల్​

అమెజాన్ ఆఫర్లు ఇలా..

ఈ సేల్​లో కొనుగోళ్లకు హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్​ కార్డుల ద్వారా చెల్లింపులు జరిపితే 10 శాతం తక్షణ డిస్కౌంట్​ లభించనుందని తెలిపింది అమెజాన్.

శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ (6జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్​) ధరను రూ.25,999కి తగ్గించింది​. దీని అసలు ధర రూ.29,999గా ఉంది. కూపన్ ద్వార మరో రూ.1000 డిస్కౌంట్ పొందే వీలుంది.

ఐఫోన్ 11 (64 జీబీ) ధరను రూ.38,999గా నిర్ణయించింది అమెజాన్​.

రెడ్​మీ 50 4కే టీవీ ధరను రూ.44,999 నుంచి రూ.35,999కి తగ్గించింది. ఎక్స్ఛేంజ్​ ద్వారా మరింత డిస్కౌంట్ పొందే వీలుంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.