Fixed Deposit Interest Rates: ఎన్ని పెట్టుబడి పథకాలు ఉన్నప్పటికీ ఫిక్స్డ్ డిపాజిట్లపై(ఎఫ్డీ) మదుపరులకు నమ్మకం ఎక్కువే. ఇతర పెట్టుబడి పథకాలతో పోలిస్తే.. తక్కువ ప్రమాదకరమైంది. సురక్షితమైంది. ఎఫ్డీలో అధిక వడ్డీ రేటు పొందేందుకు పలు రకాల ఆప్షన్లను ఎంచుకోవచ్చు. పన్ను ప్రయోజనాలనూ పొందవచ్చు. వృద్ధులకు(సీనియర్ సిటిజన్స్) అయితే వడ్డీ రేట్లు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అందుకే స్వల్పకాలిక అవసరాలు ఉన్నవారు.. అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలనుకున్నప్పుడు వీటికే ప్రాధాన్యం ఇస్తారు.
FD Interest Rates in Banks
ఎఫ్డీలకు సంబంధించి వడ్డీ రేట్లు బ్యాంకులను బట్టి మారుతుంటాయి. డిపాజిట్ కొనసాగించే వ్యవధి, డిపాజిట్ మొత్తాన్ని బట్టి కూడా రాబడి ఉంటుంది. ప్రస్తుతం ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 4.4 శాతం నుంచి 6.3 వరకు ఉన్నాయి. కొన్ని బ్యాంకులు అంతకంటే ఎక్కువ కూడా ఇస్తున్నాయి. ముఖ్యంగా స్మాల్ ఫినాన్స్ బ్యాంకులు ఎక్కువ వడ్డీ రేటు ఇస్తున్నాయి.
ఫిక్స్డ్ డిపాజిట్ ప్రారంభించే ముందు పలు బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లను తెలుసుకోవటం ముఖ్యం. తద్వారా ఏ బ్యాంకులో ఎక్కువ వడ్డీ రేటు లభిస్తుంది? ఎందులో ఎక్కువ ప్రయోజనాలు పొందొచ్చు? అనే విషయాలు తెలుస్తాయి.
రూ.కోటి లోపు ఎఫ్డీలపై వివిధ వ్యవధులకు పలు బ్యాంకులు అందిస్తోన్న వడ్డీ రేట్లు ఎంత శాతం ఉన్నాయో చూద్దాం.
ప్రభుత్వ బ్యాంకులు
ప్రైవేటు బ్యాంకులు
స్మాల్ ఫినాన్స్ బ్యాంకులు
Source: www.bankbazaar.com
గమనిక: వడ్డీ రేట్లు శాతాల్లో. కేవలం అవగాహన కోసం మాత్రమే వడ్డీ రేట్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. పూర్తి వివరాలకు మీ బ్యాంకును సంప్రదించండి. సీనియర్ సిటిజన్లకు 0.5 శాతం వడ్డీ అధికంగా ఉంటుంది.
ఇదీ చూడండి: అప్పుల భారాన్ని తగ్గించుకోండి ఇలా...