ETV Bharat / business

పదహారో విడత జీఎస్టీ పరిహారం విడుదల - పలు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు జీఎస్టీ పరిహారం

జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు రూ. 6 వేల కోట్లు బదిలీ చేసింది కేంద్ర ఆర్థిక శాఖ. ఇప్పటివరకు పలు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి 86 శాతం జీఎస్టీ పరిహారం చెల్లించినట్లు పేర్కొంది.

FinMin releases weekly instalment of Rs 6,000 cr to states
పదహారో విడత జీఎస్టీ పరిహారం విడుదల
author img

By

Published : Feb 16, 2021, 5:50 AM IST

Updated : Feb 16, 2021, 6:11 AM IST

పదహారో విడత జీఎస్​టీ పరిహారం కింద రూ.6 వేల కోట్లు బదిలీ చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం ప్రకటించింది. దీంతో... ఇప్పటివరకు మొత్తం రూ.95 వేల కోట్లు విడుదల చేసినట్లు పేర్కొంది.

పలు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు 86 శాతం జీఎస్టీ పరిహారం చెల్లించినట్లు కేంద్రం తెలిపింది. ఇందులో... రాష్ట్రాలకు రూ.86,729 కోట్లు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలు.. దిల్లీ, జమ్ము కశ్మీర్, పుదుచ్చేరి లకు కలిపి రూ. 8,270 కోట్లు బదిలీ చేసినట్లు వెల్లడించింది.

జీఎస్​టీ​ కొరతను తీర్చేందుకు ప్రత్యేక విండో ద్వారా ఈ నిధులను బదిలీ చేస్తున్నట్లు ఆర్థిక శాఖ వివరించింది. ఈ మొత్తాన్ని 4.64 శాతం వడ్డీ రేటుకు అప్పుగా తీసుకున్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి:వాట్సాప్‌లో ఈ ఫీచర్ల గురించి తెలుసా..?

Last Updated : Feb 16, 2021, 6:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.