కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (పీఎంఎస్‌బీవై) కింద క్లెయిమ్‌లను వీలైనంత త్వరగా సెటిల్ చేయాలని కోరేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ, ప్రైవేటు రంగ బీమా కంపెనీల అధిపతులతో శనివారం భేటీ కానున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది.
ఈ పథకాల కింద క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్ కోసం అవసరమైన విధానాలు, డాక్యుమెంటేషన్ ప్రక్రియను సులభతరం చేయాలని, ఒక నిర్ణీత సమయంలోపు ఎలాంటి ఆటంకాలు లేకుండా క్లెయిమ్‌లు అందజేయాలని ఆర్థిక మంత్రి బీమా సంస్థలకు సూచిస్తారని ఆర్థిక శాఖ ట్వీట్ చేసింది.
ఇదీ చదవండి : RBI: రెపో రేటు మళ్లీ యథాతథం