ETV Bharat / business

అవినీతిలో కాంగ్రెస్​ 'మాస్టర్': ఆర్థిక మంత్రి నిర్మల - Antrix devas deal latest

Nirmala sitharaman: కాంగ్రెస్ అవినీతిలో 'మాస్టర్' అని దుయ్యబట్టారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​. దేవాస్​- ఆంథ్రిక్స్​ ఒప్పందం మోసపూరితమైందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆధారంగా చూపుతూ ఈ విమర్శలు గుప్పించారు. రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని అవినీతి సంస్థకు చేరకుండా తాము అడ్డుకుంటున్నట్లు పేర్కొన్నారు.

nirmala sitharaman press conference, నిర్మలా సీతారామన్​
నిర్మలా సీతారామన్​
author img

By

Published : Jan 18, 2022, 7:28 PM IST

Nirmala sitharaman: దేవాస్​- ఆంథ్రిక్స్ ఒప్పందం మోసపూరితమైందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ కాంగ్రెస్​పై విమర్శల వర్షం కురిపించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. కాంగ్రెస్​ అవినీతికి ఇది నిదర్శనమని దుయ్యబట్టారు. సుప్రీం తీర్పుతో రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని అవినీతి సంస్థకు చేరకుండా అడ్డుకునేందుకు అవకాశం దొరికిందని, దాన్ని కచ్చితంగా సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే యూపీఏ ప్రభుత్వం దేవాస్​ సంస్థకు ఎస్​-బ్యాండ్​ శాటిలైట్ స్పెక్ట్రంను అతి తక్కువ ధరకు కేటాయించిందని ఆరోపించారు. 'అవినీతి'లో కాంగ్రెస్ మాస్టర్​ అని దుయ్యబట్టారు.

Antrix devas deal

2005 జనవరిలో రెండు ఉపగ్రహాల ప్రయోగం, నిర్వహణ విషయంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వాణిజ్య విభాగం ఆంథ్రిక్స్​, దేవాస్​ మధ్య ఒప్పందం కుదిరింది. అయితే అయితే ఎస్​ స్పెక్ట్రంను దేశ భద్రత కోసం రక్షణ శాఖ మాత్రమే వినియోగించుకోవాలనుకోవడం వల్ల 2011లో దేవాస్​తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆంథ్రిక్స్​ రద్దు చేసుకుంది. ఆంథ్రిక్స్​కు వివిధ దేశాల్లో బ్రాంచీలు ఉండటం వల్ల అంతర్జాతీయ ట్రైబ్యునళ్లను ఆశ్రయించింది దేవాస్​. ఒప్పంద రద్దు కావడం వల్ల తమకు నష్టం వాటిల్లిందని వాదించింది.

దేవాస్ మల్టీమీడియా కార్పొరేషన్‌కు ఆంథ్రిక్స్​ కార్పొరేషన్ 562.5 మిలియన్ డాలర్ల పరిహారంతో పాటు వడ్డీ కలిపి మొత్తం 1.2 బిలియన్​ డాలర్లు చెల్లించాలని అంతర్జాతీయ ట్రైబ్యునల్​ తీర్పు వెలువరించింది. అవసరమైతే ఆస్తులు సీజ్ చేయవచ్చని చెప్పింది. దీంతో పారిస్ సహా ఫ్రాన్స్​లోని భారత ఆస్తులను దేవాస్​ వాటాదారులు సీజ్ చేశారు. కెనడాలోని ఎయిర్ ఇండియా ఆస్తలపై పాక్షిక హక్కులు పొందారు.

దీనిపై కేంద్రం సుప్రీం ఆశ్రయించగా.. తీర్పు అనుకూలంగా వచ్చింది. దేవాస్ ఒప్పందం మోసపూరితంగా ఉందని, దాన్ని రద్దు చేయాలనే దివాలా కోర్టు నిర్ణయం సరైనదేనని 2022 జనవరి 17న తీర్పునిచ్చింది. దీని ఆధారంగా నిర్మలా సీతారామన్​ కాంగ్రెస్​పై విమర్శలు గుప్పించారు. దేవాస్​ న్యాయపోరాటం చేయకుండా దేశ భద్రత కారణాన్ని కూడా యూపీఏ చూపించలేకపోయిందని ధ్వజమెత్తారు. ఈ తీర్పుతో అంతార్జాతీయ టైబ్రునళ్లను ఆశ్రయిస్తామన్నారు. సమన్యాయపాలనను అన్ని దేశాలు గౌరవిస్తాయని, అందుకే న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందన్నారు.

ఇదీ చదవండి: చమురు ధరలకు రెక్కలు.. భారత్​లో మాత్రం నో ఛేంజ్​.. ఎన్నికలయ్యాక వాత!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.