ETV Bharat / business

హైదరాబాద్‌ కంపెనీ నుంచి 'ఫవిపిరవిర్'‌ ట్యాబ్లెట్‌ - Optimus PHarma

కరోనా రోగులకు ఉపశమనం కలిగిస్తుందని భావిస్తోన్న ఫవిపిరవిర్​ ఔషధం వారం రోజుల్లో అందుబాటులోకి రానుంది. ఈ ఔషధం విక్రయానికి హైదరాబాద్​ కేంద్రంగా పనిచేస్తున్న ఆప్టిమస్​ ఫార్మాకు డీసీజీఐ, టీ-డీసీఏ అనుమతులు లభించాయి. 'ఫావికోవిడ్​ 200' అనే బ్రాండ్​ పేరుతో విడుదల చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.

FEVIPIRAVIR TABLETS
హైదరాబాద్‌ కంపెనీ నుంచి ఫవిపిరవిర్‌ ట్యాబ్లెట్‌
author img

By

Published : Jul 24, 2020, 8:17 AM IST

ఒక మోస్తరు నుంచి మధ్యస్థంగా కొవిడ్‌-19 తో బాధపడుతున్న రోగులకు ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్న ఫవిపిరవిర్‌ ఔషధాన్ని విక్రయించటానికి హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఆప్టిమస్‌ ఫార్మాకు భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ), తెలంగాణ డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (టీ-డీసీఏ) 'పరిమిత వినియోగం కోసం' అనుమతి ఇచ్చాయి. దీంతో వారం రోజుల వ్యవధిలో ఫవిపిరవిర్‌ 200 ఎంజీ ట్యాబ్లెట్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ఆప్టిమస్‌ ఫార్మా ప్రకటించింది. కొంతకాలం క్రితం ఈ కంపెనీకి అనుబంధ సంస్థ అయిన ఆప్ట్రిక్స్‌ ఫార్మా ఫావిపిరవిర్‌ ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్‌) తయారీకి అనుమతి పొందిన విషయం విదితమే. తాజాగా ఈ ఔషధం ట్యాబ్లెట్‌ తయారీ- విక్రయానికి ఆప్టిమస్‌ ఫార్మా సిద్ధమైంది. 'ఫావికోవిడ్‌ 200' అనే బ్రాండ్‌ పేరుతో దీన్ని విడుదల చేయనున్నట్లు కంపెనీ డైరెక్టర్‌ పి.ప్రశాంతరెడ్డి తెలిపారు. పరిమిత వినియోగం కోసం అనుమతించిన ఔషధం అయినందున దీన్ని వినియోగించదలచుకున్న రోగులు ముందుగానే చికిత్సకు తమ సమ్మతి పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఈ ట్యాబ్లెట్లను 14 రోజుల పాటు వాడాలని వైద్యులు సిఫారసు చేస్తున్నారు.

ధర తగ్గుతుందా?

ఇప్పటి వరకూ గ్లెన్‌మార్క్‌ ఫార్మాకు చెందిన 'ఫావిఫ్లూ' ఔషధం మాత్రమే మార్కెట్లో ఉంది. ఒక్కో ట్యాబ్లెట్‌కు తొలుత రూ.103 ధర నిర్ణయించిన గ్లెన్‌మార్క్‌, ఆ తర్వాత ట్యాబ్లెట్‌ ధరను రూ.75కు తగ్గించింది. ఇప్పుడు పోటీ వచ్చినందున ఇంకా తక్కువ ధరకే ఈ ట్యాబ్లెట్‌ను రోగులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. బెంగళూరుకు చెందిన స్ట్రైడ్స్‌ ఫార్మా ఈ ఔషధాన్ని తయారు చేసినప్పటికీ ఇంకా అనుమతి కోసం ఎదురుచూస్తోంది. మరోపక్క హైదరాబాద్‌ నుంచి ఆప్టిమస్‌ ఫార్మా, బయోఫోర్‌ ఇండియా ఫార్మాస్యూటికల్స్‌ ఈ ఔషధాన్ని తయారు చేస్తున్నాయి. తాజాగా ఆప్లిమస్‌ ఫార్మాకు ఈ ఔషధాన్ని దేశీయ మార్కెట్లో విక్రయించటానికి, ఎగుమతి చేయటానికి అనుమతి వచ్చింది. నిబంధనల ప్రకారం ఈ కంపెనీకి అనుమతి ఇచ్చినట్లు తెలంగాణా డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వై.నవీన్‌ కుమార్‌ తెలిపారు.

బ్రింటన్‌ ఫార్మా కూడా...

ఫవిపిరవిర్‌ ట్యాబ్లెట్‌ తయారీ- విక్రయానికి తమకు డీసీజీఐ నుంచి అనుమతి వచ్చినట్లు బ్రింటన్‌ ఫార్మా అనే దేశీయ కంపెనీ వెల్లడించింది. 'ఫావిటన్‌' అనే బ్రాండు పేరుతో ఈ ఔషధాన్ని విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఒక్కో ట్యాబ్లెట్‌ (200 ఎంజీ డోసు) కు రూ.59 ధర నిర్ణయించినట్లు తెలియజేసింది.

వైరస్‌లను నిర్మూలించే యూవీ బాక్స్‌ 360

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా.. పలు వస్తువులను క్రిమిరహితంగా చేసే అల్ట్రావైలెట్‌ పరికరాన్ని సేఫ్‌వే అడ్వాన్స్‌డ్‌ డిజిన్ఫెక్టెంట్‌ సిస్టమ్స్‌ రూపొందించింది. ఈ 'బాక్స్‌ 360' పరికరం ఎలాంటి రసాయనాల అవసరం లేకుండా అన్ని రకాల వస్తువులను సమర్థంగా శుభ్రం చేస్తుందని సంస్థ తెలిపింది. ప్రస్తుతం 5 రకాల ఉత్పత్తులను తీసుకొచ్చినట్లు, ఏడాదిలో 37 రకాలు తీసుకురావలన్నది తమ లక్ష్యమని సంస్థ సీఎండీ, వ్యవస్థాపకుడు సీవీఎన్‌ వంశీ తెలిపారు. ఏడాదిలో 10వేల బాక్స్‌ 360లను విక్రయించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. రకాన్ని బట్టి ధర రూ.14వేల నుంచి రూ.లక్షలోపు ఉంటుందని చెప్పారు.

గాలిని శుద్ధి చేసే వైరస్‌ కిల్లర్‌

మూసి ఉన్న గదుల్లో గాలిని శుభ్రపరిచి, బ్యాక్టీరియా, వైరస్‌లను నిర్మూలించే పరికరం వైరస్‌ కిల్లర్‌ను ఊర్జా క్లీన్‌టెక్‌ ఎల్‌ఎల్‌పీ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ పరికరం కరోనా వైరస్‌తో సహా నిర్మూలిస్తుందని సంస్థ ప్రకటించింది. మొత్తం మూడు మోడళ్లలో దీన్ని విడుదల చేస్తున్నట్లు గృహ, వాణిజ్య అవసరాలకు ఇవి ఉపయోగపడతాయని పేర్కొంది. దీనితో గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను నివారించేందుకు వీలవుతుందని ఊర్జా క్లీన్‌టెక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, వ్యవస్థాపకుడు మధుసూదన్‌ తెలిపారు.

ఇదీ చూడండి: 'వాడిపడేసే మాస్కులను కత్తిరించేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.