ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ హానర్ దేశీయ విపణిలోకి రెండు బడ్జెట్ ఫోన్లను తీసుకురానుంది. హానర్ 9ఏ, హానర్ 9ఎస్ పేర్లతో ఈ నెలాఖరులోపు వీటిని విపణిలోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
9ఏ మోడల్‌ను ఇటీవలే చైనాలో ఆవిష్కరించింది హానర్. దీని ధర దాదాపు 1200 యువాన్లుగా (రూ.12 వేలకు పైమాటే). భారత్‌లోను ఇంచుమించు అదే ధరకు అందుబాటులోకి తేవచ్చని తెలుస్తోంది. హానర్ 9ఎస్ ధర రూ.7 వేల లోపే ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి.
ఈ రెండు మోడళ్ల ఫీచర్ల అంచనాలు ఇలా ఉన్నాయి.
హానర్ 9ఏ
- 6.3 అంగుళాల డిస్ప్లే
- మీడియాటెక్ ఎంటీ6765 ఎస్ఓసీ ప్రాసెసర్
- 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజి
- వెనుక వైపు మూడు కెమెరాలు (13ఎంపీ,+5ఎంపీ,+ 2ఎంపీ)
- 8 ఎంపీ సెల్ఫీ కెమెరా
- 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
హానర్ 9ఎస్ బడ్జెట్ ఫోన్..
- 5.45 అంగుళాల డిస్ప్లే
- మీడియాటెక్ ఎంటీ6762 ఎస్ఓసీ ప్రాసెసర్
- 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజి
- 8ఎంపీ రియర్ కెమెరా
- 5ఎంపీ సెల్ఫీ కెమెరా
- 3,020 ఎంఏహెచ్ బ్యాటరీ
ఇదీ చూడండి:తప్పు జరిగింది.. క్షమించండి: ట్విట్టర్