ETV Bharat / business

'ఎఫ్​డీఐ'ల్లో 500 బి. డాలర్ల మార్కు​ దాటిన భారత్​

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో భారత్​ మరో మైలురాయిని అందుకుంది. 2020, సెప్టెంబర్​ నాటికి 500 బిలియన్​ డాలర్ల మార్కు​ను దాటినట్లు ప్రకటించింది కేంద్రం. మారిషస్​ నుంచి అత్యధికంగా పెట్టుబడులు అందగా.. ఆ తర్వాతి స్థానంలో సింగపూర్​, అమెరికా, నెదర్లాండ్స్​, జపాన్​లు ఉన్నాయి.

FDI equity inflows into India cross USD 500 bn milestone
'ఎఫ్​డీఐ'ల్లో 500 బి. డాలర్ల మార్కు​ దాటిన భారత్​
author img

By

Published : Dec 6, 2020, 2:46 PM IST

Updated : Dec 6, 2020, 3:03 PM IST

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్​డీఐ) ఆకర్షించటంలో భారత్​ దూసుకుపోతోంది .పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన ప్రపంచ గమ్యస్థానంగా మారుతోంది. ఈ క్రమంలోనే ఎఫ్​డీఐల్లో.. 2000 ఏప్రిల్​ నుంచి 2020 సెప్టెంబర్​ నాటికి 500 బిలియన్​ డాలర్ల మైలురాయిని దాటింది భారత్​.

డిపార్ట్​మెంట్​ ఫర్​ ప్రమోషన్​ ఆఫ్​ ఇండస్ట్రీ అండ్​ ఇంటర్నల్​ ట్రేడ్​(డీపీఐఐటీ) తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో ఈ మేరకు వెల్లడైంది. రెండు దశాబ్దాల కాలంలో భారత్​లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మొత్తం 500.12 బిలియన్​ డాలర్లకు చేరుకున్నట్లు తెలిపింది.

తొలిస్థానంలో మారిషస్​..

మొత్తం ఎఫ్​డీఐల్లో 29 శాతం మారిషస్​ నుంచే వచ్చాయి. ఆ తర్వాత సింగపూర్​ (21 శాతం), అమెరికా, నెదర్లాండ్స్​, జపాన్​ (7 శాతం), బ్రిటన్​ (6 శాతం)ల నుంచి ఎఫ్​డీఐలు భారత్​కు వచ్చాయి. మారిషస్​ నుంచి మొత్తం 144.71 బిలియన్​ డాలర్ల ఎఫ్​డీఐలు రాగా.. సింగపూర్​ నుంచి 106 బిలియన్​ డాలర్ల పెట్టుబడులు అందాయి.

ఆయా దేశాలతో పాటు జర్మనీ, సిప్రస్​, ఫ్రాన్స్​, సైమన్​ ఐలాండ్స్​ నుంచి కూడా భారత్​లోకి భారీగా ఎఫ్​డీఐలు వచ్చాయి.

2015-16 ఆర్థిక ఏడాది నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది. ఆయా ఆర్థిక సంవత్సరాల్లో భారత్​కు వచ్చిన ఎఫ్​డీఐల వివరాలు ఇలా ఉన్నాయి.

ఆర్థిక ఏడాది

ఎఫ్​డీఐలు

(బిలియన్​ డాలర్లలో)

2015-16 40
2016-1743.5
2017-1844.85
2018-1944.37
2019-2050

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించిన వాటిల్లో ప్రధానంగా సేవారంగం, కంప్యూటర్​ సాఫ్ట్​వేర్​, హార్డ్​వేర్​, టెలికమ్యూనికేషన్స్​, ట్రేడింగ్​, నిర్మాణ రంగం, ఆటోమొబైల్​, కెమికల్స్​, ఫార్మాస్యూటికల్స్​లు ఉన్నాయి.

1999లో ఎఫ్​ఈఆర్​ఏ ఏర్పాటుతో భారత ఎఫ్​డీఐల ప్రయాణం మొదలైందని గుర్తు చేసుకున్నారు నంగియా అండర్సన్​ ఇండియా సభ్యులు నిశ్చల్​ అరోరా. 'హాఫ్​ ట్రిలియన్​​ డాలర్ల ఎఫ్​డీఐలు రావటం.. 2007-08 ప్రపంచ మాంద్యం సమయంలోనూ లాభాలను ఇచ్చిన భారత బలమైన ఆర్థిక గణాంకాలు, స్థిరమైన రాజకీయ దృక్పథం, నిరంతర ఆర్థిక వృద్ధిపై విదేశీ పెట్టుబడిదారులకు ఉన్న బలమైన నమ్మకాన్ని సూచిస్తోంది' అని పేర్కొన్నారు. ప్రస్తుత కరోనా మహమ్మారితో వచ్చే దశాబ్దం కోసం భారత్​ జాగ్రత్తగా అడుగులు వేస్తోందని, తయారీ, సాంకేతిక రంగాల్లో ఎఫ్​డీఐలను ఆకర్షించటానికి ప్రభుత్వం తగిన చర్యలను కొనసాగించటం అవసరమని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: సంక్షోభంలోనూ భారత్‌కు ఎఫ్‌డీఐల వెల్లువ!

Last Updated : Dec 6, 2020, 3:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.