ETV Bharat / business

ఈ 15 రోజుల్లో ఫాస్టాగ్​ ఉచితంగానే పొందొచ్చు - ఫాస్టాగ్​ రేట్లు

వాహనాదారుల్లో ఫాస్టాగ్ వినియోగాన్ని పెంచేందుకు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్​ల జారీకి రూ.100గా ఉన్న రుసుమును 15 రోజుల వరకు ఎత్తివేయనున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్​హెచ్​ఏఐ) ప్రకటించింది.

FASTag to be available free of charge for 15 days
ఈ 15 రోజుల్లో ఫాస్టాగ్​ ఉచితంగానే పొందొచ్చు
author img

By

Published : Feb 12, 2020, 11:12 PM IST

Updated : Mar 1, 2020, 3:51 AM IST

డిజిటల్​ పద్ధతిలో జాతీయ రహదార్లపై టోల్​ వసూలు చేసేందుకు ప్రవేశపెట్టిన ఫాస్టాగ్​లపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్​హెచ్​ఏఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాటి వినియోగం పెంచేందుకు ఈ నెల 29 వరకు ఫాస్టాగ్​ల కొనుగోలుకు రూ.100 రుసుము వసూలు చేయొద్దని నిర్ణయించింది.

దేశవ్యాప్తంగా జాతీయ రహదార్లపై ఉన్న 527 టోల్​ ప్లాజాల వద్ద ఎలక్ట్రానిక్​ పద్ధతిలో ఎన్​హెచ్​ఏఐ టోల్​ వసూలు చేయడం ఇప్పటికే ప్రారంభించిన విషయం విధితమే.

ఏదైన అధికారిక ఫాస్టాగ్​ పాయింట్​ ఆఫ్​ సేల్ వద్ద.. గుర్తింపు పొందిన రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించి ఉచితంగా ఫాస్టాగ్​ పొందొచ్చని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి?

జాతీయ రహదార్లపై ఉన్న అన్ని టోల్​ ప్లాజాల వద్ద, రీజినల్​ ట్రాన్స్​పోర్ట్​ కార్యాలయాల వద్ద, కామన్​ సర్వీస్​ సెంటర్లు, ట్రాన్స్​పోర్ట్​ హబ్​లు, పెట్రోల్​ పంపుల వద్ద ఫాస్టాగ్​లు కొనుగోళ్లకు అందుబాటులో ఉన్నాయి.

ఫాస్టాగ్​ల పాయింట్​ ఆఫ్​ సేల్స్​ గురించి తెలుసుకునేందుకు మైఫాస్టాగ్​ అనే మొబైల్ యాప్​లో గానీ, www.ihmcl.com లోగానీ, 1033కి కాల్​ చేసి గానీ తెలుసుకోవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

అయితే ఫాస్టాగ్​ ఉచితంగా ఇచ్చినప్పటికీ.. సెక్యూరిటీ డిపాజిట్లు, ఫాస్టాగ్​ ఖాతాలో కనీస నిల్వల మొత్తంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది ఎన్​హెచ్​ఏఐ.

ఇదీ చూడండి:మార్కెట్లోకి పల్సర్ 150 బీఎస్​6 వేరియంట్​

Last Updated : Mar 1, 2020, 3:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.