ETV Bharat / business

బైక్​ కొనే ముందు  ఇవి గుర్తుంచుకోండి! - budget bike

కరోనా వల్ల భౌతిక దూరం పాటించాల్సి రావడం వల్ల వ్యక్తిగత వాహనాల కొనుగోలు చేసేవారు పెరిగారు. చాలా మంది ద్విచక్ర వాహనాలను తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే బైక్​ కొనాలంటే.. ఏ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి?

bike
బైక్​
author img

By

Published : May 8, 2021, 8:31 AM IST

కారుతో పోల్చుకుంటే ద్విచక్రవాహనం ఆర్థికంగా ఎంతో మెరుగైనదని చెప్పుకోవచ్చు. మైలేజీ ఎక్కువ ఇస్తుంది. అంతేకాకుండా పార్కింగ్ స్థలం కూడా చాలా తక్కువ అవసరం ఉంటుంది. సామాన్య ప్రజలకు సరసమైన ధరలో అందుబాటులో ఉంటుంది. కరోనా వల్ల ప్రజా రవాణాపై నెలకొన్న భయాలతో ద్విచక్ర వాహనాలకు డిమాండ్ పెరిగింది. ఆఫీసుకు వెళ్లటానికి, ఇంటికి రావటానికి బైక్​ సౌకర్యంగా ఉంటుంది. రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల వల్ల నగరాల్లో కారు కంటే బైక్​తోనే త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. అయితే ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలనుకుంటే ఎలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకోవాలో చూద్దాం.

బ్రాండ్​

బైక్ అనేది చాలా రోజులు నడుస్తుంది. మార్కెట్​లో మంచి పేరున్న బ్రాండ్​ను ఎంపిక చేసుకోవటం చాలా ఉత్తమం. ప్రసిద్ధి చెందిన సంస్థలు నాణ్యత విషయంలో మంచి ప్రమాణాలను అనుసరిస్తాయి. భారత్​లో హీరో మోటార్స్​, బజాజ్​, టీవీఎస్​, హోండా, సుజుకీ వంటి కంపెనీల బైక్​లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఒక వేళ ద్విచక్రవాహనాన్ని కొన్ని రోజుల అనంతరం విక్రయించాలనుకుంటే బ్రాండ్ అనేది కీలకంగా మారుతుంది.

బడ్జెట్​

బైక్ కొనేముందు ఎంత బడ్జెట్​లో తీసుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. కేవలం బడ్జెట్ ఆధారంగా మాత్రమే నిర్ణయం తీసుకోకూడదు. ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. కొంత వరకు బడ్జెట్​ను పెంచుకోవటం వల్ల మంచి బైక్ కొనేందుకు వీలుంటుంది.

మైలేజ్

రోజురోజుకు పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. కాబట్టి మైలేజీ అనేది కీలకం. బైక్ తీసుకునే ముందు మైలేజీ అనేది తప్పకుండా తెలుసుకోవాలి(ఒక లీటర్​ పెట్రోల్​తో ప్రయాణించే దూరమే మైలేజీ). సాధారణంగా ద్విచక్ర వాహనాలు సగటున 35 నుంచి 40 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంటాయి. అయితే ఇది బైక్ మోడల్​ను బట్టి మారుతుంది. మైలేజీ ఎక్కువ ఇచ్చే బైక్ తీసుకుంటే పెట్రోలు ఆదా చేసుకోవచ్చు. అయితే ఇవి తక్కువ సామర్థ్యంతో వస్తాయన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.

ఎత్తు

బైక్​ను సరిగ్గా నియంత్రించాలంటే మనకు సరిపోయే ఎత్తులో ఉన్నది ఎంచుకోవాలి. మన ఎత్తుకు సరిపోని బైక్​ను తీసుకుంటే సౌకర్యంగా ఉండకపోవచ్చు. దీనికోసం వివిధ మోడళ్లను పరిశీలించవచ్చు.

సర్వీస్ సెంటర్​

ఎక్కువ సర్వీస్ సెంటర్లున్న బైక్​ అయితే సర్వీసింగ్​ సులభం అవుతుంది. తరచూ సర్వీసింగ్ చేయాల్సి ఉంటుంది.. కాబట్టి ఈ విషయాన్ని కొంత నిశితంగా పరిశీలించాలి. సర్వీస్ సెంటర్ అందుబాటులో లేనట్లయితే ప్రతి సారీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంటికి సమీపంలో వాహన కంపెనీకి చెందినది కానీ లేదా వాహన కంపెనీ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ కానీ ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల ఎక్కువ దూరం ప్రయాణించి సర్వీసింగ్ చేయించుకోవాల్సిన బాధ తప్పుతుంది.

నిర్వహణ ఖర్చు

బైక్​ను మంచి కండీషన్​లో నడిపేందుకు దానికి సంబంధించి నిర్వహణ చేయాల్సి ఉంటుంది. ద్విచక్ర వాహనం కొనుగోలు గురించి ఆరా తీస్తున్నప్పుడు నిర్వహణ, చెకప్ వ్యయం ఎంత ఉంటుంది? అన్న విషయాలను గమనించాలి. బైక్​తో పాటు వచ్చే ఉచిత సర్వీసులు అయిపోయాక నిర్వహణ భారం సొంత ఖర్చుల నుంచి భరించాల్సి ఉంటుంది.

విడి భాగాలు అందుబాటులో ఉన్నాయా? లేవా?

వాహనం ఎప్పుడైనా రిపేరుకు రావొచ్చు. అయితే వాటికి సంబంధించి విడి భాగాలు అందుబాటులో ఉండటం చాలా ముఖ్యం. బైక్ కొనుగోలు సమయంలోనే వీటిని గుర్తుంచుకోవాలి. ఒకవేళ విడి భాగాలు అందుబాటులో లేకుంటే బైక్ ఉన్నప్పటికీ నడపలేని పరిస్థితి తలెత్తుతుంది. కొత్తగా విడుదలయ్యే మోడళ్లకు విడి భాగాలు మార్కెట్​లో ఉండే అవకాశాలు తక్కువగా ఉండొచ్చు. కొత్త మోడల్ బైక్​లను కొనుగోలు చేసినట్లయితే ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలి.

రీసేల్ వాల్యూ

బైక్ కొనుగోలు చేసేటప్పుడు ధర మాత్రమే కాకుండా.. ఒకవేళ మళ్లీ విక్రయించాలనుకుంటే మంచి ధర కూడా రావాలి. ఇది బైక్ బ్రాండ్​తో పాటు కండీషన్, కొనుగోలు చేసిన సమయం ఆధారంగా నిర్ణయిస్తారు. కాబట్టి మంచి రీసేల్ విలువ ఉన్న బ్రాండ్ ను ఎంచుకోవాలి.

సమీక్షలు(రివ్యూలు)

వాహనానికి సంబంధించిన వెబ్​సైట్లలో రివ్యూలు ఉంటాయి. ఇప్పటికే ఉపయోగించినవారు వీటిని రాస్తుంటారు. వీటి వల్ల క్షేత్ర స్థాయిలో బైక్ ఎంత మైలేజీ ఇస్తుంది? ఎంత సౌకర్యంగా ఉంటుంది? ఇలా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. నెగెటివ్ రివ్యూలు ఎక్కువగా ఉన్న బైక్​ను కొనుగోలు చేయటంపై ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవచ్చు. టెస్ట్ డ్రైవ్ చేయటం ద్వారా కూడా బైక్​కు సంబంధించి అవగాహన తెచ్చుకోవచ్చు.

ఇదీ చూడండి:ట్విట్టర్​లో కొత్తగా 'టిప్​ జార్​' ఫీచర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.