కరోనా వ్యాప్తి నేపథ్యంలో సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్ వినియోగదారులకు 'కేర్' అనే ఎమోజీని అందుబాటులోకి తీసుకురానుంది. యాప్, మెసెంజర్లో వచ్చే వారం నుంచి ఇది కనిపించనుంది. లైక్ బటన్తోపాటే కొత్త ఎమోజీ ఉండనుంది.
" ప్రస్తుతం కరోనా వ్యాప్తి వంటి తరుణంలో ప్రజలు తమ మద్దతును ఒకరితో ఒకరు పంచుకునేలా ఫేస్బుక్ యాప్, మెసెంజర్లో ఈ 'కేర్' బటన్ను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. వచ్చేవారం ఇది వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. "
-- ఫేస్బుక్
కరోనాపై పోరులో తన వంతు పాత్ర పోషించేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకొస్తోంది ఫేస్బుక్. ముఖ్యంగా నకిలీ వార్తల కట్టడికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. కరోనాకు సంబంధించి అసత్య సమాచారాన్ని లైక్ చేసిన వారికి వార్నింగ్ ఇచ్చే విధానం తీసుకొస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది.
ఇదీ చదవండి: ప్రీపెయిడ్ కనెక్షన్ గడువు పెంచిన బీఎస్ఎన్ఎల్