చిన్నారులపై జరిగే వేధింపులు, దూషణలకు సంబంధించిన అంశాలు తమ ప్లాట్‌ఫాం ద్వారా వ్యాప్తి చెందకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్. అందులో భాగంగా నిబంధనలను కఠినతరం చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. చిన్నారులకు హాని కలిగించే సమాచారానికి అడ్డుకట్ట వేయడం సహా పర్యవేక్షించేందుకు త్వరలోనే కొత్త టూల్స్ తెస్తున్నట్లు వివరించింది.
''చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన అంశాల వ్యాప్తిని ఏమాత్రం సహించబోం. చిన్నారులకు హాని తలపెట్టే పనులకు.. తమ అప్లికేషన్లను వినియోగించడం హేయమైన చర్య. అలాంటి చర్యలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు.''
- డేవిస్, ఫేస్‌బుక్ భద్రతా విభాగం గ్లోబల్ హెడ్
తొలి టూల్లో ఇలాంటి అంశాలపై శోధించినవారికి హెచ్చరిక సందేశం పంపుతుంది ఫేస్‌బుక్.
రెండో దాంట్లో.. చిన్నారులకు ఇబ్బంది కలిగించే సమాచారాన్ని షేర్ చేసి, మీమ్స్ సృష్టించే వారికి సేఫ్టీ అలర్ట్‌ను చూపిస్తుంది. సంబంధిత సమాచారం.. తమ విధానాలకు విరుద్ధమని, వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతుంది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకొనే అవకాశం కూడా ఉంది.
ఇదీ చూడండి: బిట్‌కాయిన్‌లో ట్విట్టర్ బాస్ భారీ పెట్టుబడి