ETV Bharat / business

ఫేస్​బుక్​ పబ్లిక్​ పాలసీ హెడ్​గా మాజీ ఐఏఎస్​ అధికారి

ఫేస్​బుక్​ పబ్లిక్​ పాలసీ హెడ్​గా మాజీ ఐఏఎస్​ అధికారి రాజీవ్​ అగర్వాల్​ నియమితులయ్యారు. సుదీర్ఘకాలం పాటు ప్రజా సంబంధ వ్యవహారాలపై అనుభవం ఉన్న రాజీవ్​ను గతంలో పనిచేసిన అంఖీదాస్​ స్థానంలో నియమించింది సంస్థ. విద్వేషపూరిత ప్రసంగాల విషయంలో అంఖీదాస్​ రాజీనామా చేశారు.

facebook
ఫేస్​బుక్​
author img

By

Published : Sep 20, 2021, 11:22 AM IST

గతంలో వివాదాస్పదంగా మారిన ఫేస్​బుక్​ పబ్లిక్​ పాలసీని తిరిగి పునరుద్ధరించే దిశగా ఆ సంస్థ అడుగులు వేసింది. ప్రజా సంబంధ వ్యవహారాలపై సుదీర్ఘ అనుభవం ఉన్న మాజీ ఐఏఎస్​ అధికారి రాజీవ్​ అగర్వాల్​ను పబ్లిక్​ పాలసీ హెడ్​గా నియమించింది. గతంలో ఆయన ఊబర్​కు పబ్లిక్​ పాలసీ హెడ్​గా పనిచేశారు.

ఫేస్​బుక్​ భారత పబ్లిక్​ పాలసీ హెడ్​ పదవి నుంచి అంఖీ దాస్​ గతేడాది అక్టోబర్​లో తప్పుకున్నారు. నాయకుల విద్వేషపూరిత ప్రసంగాలు, కంటెంట్​ నిర్వహణ విషయంలో ఫేస్​బుక్​ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో రాజీనామా చేసిన దాస్​ స్థానంలో రాజీవ్​ను నియమించినట్లు ఫేస్​బుక్​ ఇండియా ఎండీ అజిత్​ మోహన్​ తెలిపారు.

వినియోగదారుల భద్రత, సమాచార రక్షణ, గోప్యత, ఇంటర్నెట్ గవర్నెన్స్​లకు సంబంధించిన అజెండాను భారత్​లో అభివృద్ధి చేయడానికి రాజీవ్​ కృషి చేస్తారని పేర్కొన్నారు. ఐఎఎస్​ ఆఫీసర్​గా సుమారు 26 ఏళ్ల అనుభవం ఉన్న రాజీవ్​ ఉత్తర్​ప్రదేశ్​లోని 9 జిల్లాల్లో జిల్లా మేజిస్ట్రేట్​గా పనిచేశారు. భారతదేశపు మొట్టమొదటి జాతీయ-మేధో సంపత్తి హక్కుల విధానంలో మినిస్ట్రీ ఆఫ్​ కామర్స్​కు సంయుక్త కార్యదర్శిగా పని చేశారు. డిజిటల్​ ట్రాన్స్​ఫర్​మేషన్​ ఆఫ్​ ఇండియాలో ఆయన కీలక పాత్ర పోషించారు.

ఇదీ చూడండి: ఐటీ ఉద్యోగం కావాలా? ఆన్​లైన్​లో ఈ పరీక్ష రాసేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.