విదేశాలకు ఎగుమతులు వరుసగా ఆరో నెలలోనూ తగ్గుముఖం పట్టినట్లు కేంద్ర వాణిజ్యశాఖ ప్రకటించింది. జనవరిలో 1.66శాతం పడిపోయినట్లు తాజా గణాంకాల్లో తేలింది. ఎగుమతుల విలువ 25.97 బిలియన్ డాలర్లకు తగ్గినట్లు స్పష్టం చేసింది.
వాణిజ్యశాఖ లెక్కల ప్రకారం దిగుమతులు కూడా 0.75 శాతం తగ్గి 41.14 బిలయన్ డాలర్లకు చేరుకున్నాయి. ఫలితంగా వాణిజ్య లోటు 15.17 బిలియన్ డాలర్లుగా ఉంది. గతేడాది జనవరిలో వాణిజ్య లోటు 15.05 శాతంగా ఉంది.
2019-20 ఏప్రిల్-జనవరి మధ్యకాలంలో ఎగుమతుల విలువ 1.93శాతం మేర తగ్గి 265.26 బిలియన్ డాలర్లుగా ఉండగా... దిగుమతుల విలువ 8.12శాతం పడిపోయి 398.53 బిలియన్ డాలర్లకు చేరింది. ఫలితంగా వాణిజ్య లోటు 133.27 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
ఇదీ చూడండి: వారం రోజుల్లో 10వేల కోట్లు చెల్లిస్తాం: ఎయిర్టెల్