ETV Bharat / business

ఆర్థిక స్వేచ్ఛ సాధించాలంటే..

author img

By

Published : May 21, 2021, 8:19 AM IST

కరోనా ఏర్పరిచిన ఈ పరిస్థితుల్లో ఆర్థిక స్వేచ్ఛ సాధించడం ఎంతో కీలకం అంటున్నారు నిపుణులు. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు ఎదురైతే తట్టుకొని నిలబడే శక్తి వస్తుందని పేర్కొన్నారు. అప్పులకు దూరంగా, వైవిధ్యమైన పెట్టుబడులతో ఇది సాధ్యం అవుతుందని తెలిపారు.

experts on financial independence, ఆర్థిక స్వేచ్ఛపై నిపుణులు
ఆర్థిక స్వేచ్ఛ

ప్రతి వ్యక్తి ఆర్థిక పరిస్థితిని కరోనా ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో ప్రభావితం చేస్తూనే ఉంది. అనుకోకుండా కొవిడ్‌-19 బారిన పడి.. ఆసుపత్రిలో చేరితే.. రూ.లక్షల్లోనే ఖర్చవుతోంది. ఇలాంటి సమయంలో ఆర్థిక స్వేచ్ఛ సాధించడం ఎంతో కీలకమైన అంశం. అప్పుడే.. భవిష్యత్తులోనూ ఇలాంటి ఎన్నో విషమ పరీక్షలు ఎదురైనా.. తట్టుకొని నిలబడే శక్తి వస్తుంది. మరి అందుకోసం ఏం చేయాలి? చూద్దాం..

అత్యవసర నిధితో..

ఏ అవసరం ఎప్పుడు వచ్చినా.. మనం దానికి ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. అందుకే, ప్రతి ఒక్కరూ కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధిగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మొత్తం ఎప్పుడు కావాలంటే అప్పుడు నగదు రూపంలో అందుబాటులోకి రావాలి. అందుకోసం లిక్విడ్‌ ఫండ్లలాంటి వాటిలో ఈ మొత్తాన్ని మదుపు చేయాలి. ఇందులో షార్ట్‌ టర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా పెట్టుబడులను తేలిగ్గా ఉపసంహరించుకునేందుకు వీలవుతుంది.

అప్పులకూ దూరంగా..

ఇప్పటికే మీకున్న అప్పులెన్ని.. వాటికి నెలకు ఎంత ఈఎంఐ చెల్లిస్తున్నారు.. కార్డుల బిల్లుల మొత్తం ఎంత.. మీ ఆదాయం.. ఇతర పెట్టుబడులు ఇలా అన్నీ ఒక చోట రాసిపెట్టుకోండి. మీకు రావాల్సిన మొత్తం ఉంటే.. దాన్నీ లెక్కలోకి తీసుకోవాలి. మీరు చేసిన అప్పుల్లో విలువ పెంచే మంచి అప్పులేమిటి.. విలువ తగ్గించే చెడ్డ అప్పులేమిటి అనేది చూసుకోండి. ఇల్లు కొనుగోలు.. ఉన్నత చదువుల కోసం చేసినవి మంచి అప్పులు. ఇతర అవసరాల కోసం తీసుకున్న వ్యక్తిగత రుణంలాంటివి అంత మంచివి కావు. ఉన్న అప్పులను వేగంగా తీర్చేందుకు మార్గం ఏమిటో తెలుసుకోండి. అధిక వడ్డీ ఉన్న వాటిని తొందరగా వదిలించుకునే ప్రయత్నం చేయండి. మీ క్రెడిట్‌ కార్డును చాలా జాగ్రత్తగా వినియోగించండి. అనవసరంగా కొత్త రుణాలను తీసుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమాత్రం శ్రేయస్కరం కాదన్న సంగతిని గుర్తుంచుకోండి. ఇప్పటికే ఉన్న రుణాల్లో కొన్నింటిని కలిపి.. పెద్ద రుణంగా మార్చడం ద్వారా వడ్డీ భారం తగ్గే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని పరిశీలించండి.

పెట్టుబడులు ఆపొద్దు..

పెట్టుబడులు ఎంత చిన్న వయసు నుంచి ప్రారంభిస్తే అంత మంచిది. ఉదాహరణకు ఎ అనే వ్యక్తి వయసు 30 ఏళ్లు. అతను నెలకు రూ.4,000 చొప్పున 20 ఏళ్లపాటు మదుపు చేశాడనుకుందాం.. కనీసం 8 శాతం వార్షిక రాబడితో అతనికి 50 ఏళ్ల వయసు వచ్చే నాటికి చేతిలో రూ.23 లక్షలు ఉంటాయి. అదే అతను అయిదేళ్లు ఆలస్యంగా మదుపు ప్రారభించి నెలకు రూ.8,000 చొప్పున పెట్టుబడి పెట్టాడనుకుందాం.. అప్పుడు 8శాతం వార్షిక రాబడితో.. 15 ఏళ్లలో అతనికి వచ్చే మొత్తం రూ.27.87లక్షలు అవుతుంది. అదే రూ.8,000 ముందు నుంచే 20 ఏళ్లపాటు మదుపు చేస్తే.. వచ్చే మొత్తం రూ.47లక్షలకు పైగానే. అంటే.. పెట్టుబడులు ఆలస్యం చేస్తున్న కొద్దీ మనకు వచ్చే ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. కాబట్టి, వీలైనంత వరకూ పెట్టుబడులను కొనసాగిస్తూనే ఉండాలి. కరోనా కష్టం వచ్చింది కదా.. అని చేతిలో డబ్బు ఉన్నా పెట్టుబడులు పెట్టకుండా ఉండటం మంచిది కాదు. ఈ ఇబ్బందులు తాత్కాలికమే. కానీ, భవిష్యత్తులో ఆర్థిక స్వేచ్ఛకు ఇది అడ్డం కాకూడదు.

వైవిధ్యం ఉండేలా..

అన్ని పెట్టుబడులు ఒకే విధంగా ఉండవు. కొన్నింటిలో నష్టభయం ఉంటుంది. మరికొన్ని సురక్షితంగా ఉంటాయి. మీ ఆర్థిక లక్ష్యాలు.. నష్టభయం భరించే సామర్థ్యం, ఆశిస్తున్న రాబడిని బట్టి, పెట్టుబడి పథకాలను ఎంచుకోండి. మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసేవారు.. తమ వయసు, బాధ్యతల ఆధారంగా ఈక్విటీ, డెట్‌ పథకాలను ఎంచుకోవాలి. 30 ఏళ్ల వయసులో ఉన్నవారు.. 60-65శాతం పెట్టుబడిని ఈక్విటీలకు కేటాయించవచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ.. ఈక్విటీల్లో పెట్టుబడులను తగ్గించాలి.

క్రమశిక్షణతో..

ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ ఎంతో ప్రధానం. ముఖ్యంగా ఇప్పుడున్న అనిశ్చితిలో.. ప్రతి విషయాన్నీ ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. షేర్లలో మదుపు చేసినా.. మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకున్నా.. క్రమానుగత పెట్టుబడి విధానానికి ప్రాధాన్యం ఇవ్వండి. రాబోయే ఖర్చులు.. బాధ్యతల ఆధారంగా ఎంత మొత్తం పెట్టుబడి పెట్టాలన్నది నిర్ణయించుకోండి. ఒకసారి లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత.. దాన్ని చేరే వరకూ పెట్టుబడులు ఆపకూడదు.

-బి. గోప్​కుమార్, ఎండీ-సీఈఓ యాక్సిస్​ సెక్యూరిటీస్

ఇదీ చదవండి : ఐటీ రిటర్న్స్ దాఖలుకు గడువు పెంపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.