ETV Bharat / business

టీకా భారమంతా నా భుజాలపైనే: పూనావాలా - సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా తాజా

దేశంలో వ్యాక్సిన్​కు డిమాండ్​ పెరుగుతున్న నేపథ్యంలో భారమంతా తన ఒక్కడిపైనే పడుతోందని సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా సీఈఓ అదర్​ పూనావాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఒత్తిడి కారణంగానే తాను లండన్​కు వెళ్లానని చెప్పారు.

Adar Poonawalla
'భారమంతా నా భుజాలపైనే పడుతోంది'
author img

By

Published : May 2, 2021, 12:03 AM IST

కుటుంబ సమేతంగా లండన్​ వెళ్లాలని నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం తనపై ఉన్న ఒత్తిడేనని తెలిపారు సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా సీఈఓ అదర్​ పూనావాలా. కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతున్న తరుణంలో.. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్​ డిమాండ్​ను తీర్చే భారమంతా తనపైనే పడుతోందని చెప్పారు. ఈ మేరకు 'ది టైమ్స్​'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

"నేను ఇక్కడే(లండన్​) మరికొంతకాలంపాటు ఉండాలని అనుకుంటున్నాను. భారం అంతా నా ఒక్కడి భుజాలపైనే పడుతోంది. కానీ, ఒంటరిగా నేనేమీ చేయలేను. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్​ పొందాలని ఉంటుంది. దానికోసం ఎంతో నిరీక్షించాల్సి వస్తుంది. కానీ, తమ కంటే ముుందు వేరేవారు వ్యాక్సిన్​ ఎందుకు పొందాలి అనేది వారు అర్థం చేసుకోలేరు."

-అదర్​ పూనావాలా, సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ ఇండియా సీఈఓ

టీకా ఉత్పత్తిని విదేశాలకు కూడా విస్తరించాలనే ప్రణాళిక కూడా తన లండన్ పర్యటనతో ముడిపడి ఉందని పూనావాలా పేర్కొన్నారు. త్వరలో దీని గురించి ప్రకటన వెలువడుతుందని పేర్కొన్నారు.

కరోనా వ్యాక్సిన్ సరఫరాకు సంబంధించి పూనావాలాకు వివిధ సమూహాల నుంచి బెదిరింపులు వస్తున్నందున ఇటీవల 'వై' కేటగిరి భద్రత కల్పించింది కేంద్రం. ఈ విషయంపై ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. దేశంలోని అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు. కొవిషీల్డ్ సరఫరా చేయాలని తనను డిమాండ్ చేస్తున్నారని అన్నారు.

ఇదీ చూడండి: ఫేస్‌బుక్‌ మొబైల్‌ యాప్‌లో టీకా సమాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.