ETV Bharat / business

StockMarket: స్టాక్‌ మార్కెట్లో మదుపర్లకూ 'గుర్తింపు'

స్టాక్​ మార్కెట్లో మదపర్లకూ గుర్తింపు లభించేలా కొత్త విధానం తీసుకొచ్చింది సెబీ. దీంతో నిధుల సమీకరణకు కొత్త మార్గం తెరుచుకోనుంది.

stack market, investors
స్టాక్ మార్కెట్, మదుపర్లు
author img

By

Published : Aug 7, 2021, 11:07 AM IST

స్టాక్‌ మార్కెట్లో 'గుర్తింపు పొందిన మదుపర్ల'(అక్రిడిటెడ్‌ ఇన్వెస్టర్లు) విధానాన్ని మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ కొత్తగా తీసుకొచ్చింది. దీని వల్ల నిధుల సమీకరణకు కొత్త మార్గం తెరచుకున్నట్లు అవుతుంది. నియంత్రణ సంస్థ నిర్దేశించిన ఆర్థిక అర్హతల ఆధారంగా వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు, కుటుంబ ట్రస్టులు, ఏక యాజమాన్యాలు, భాగస్వామ్య సంస్థలు, ట్రస్టులు, కార్పొరేట్‌ సంస్థలకు గుర్తింపు లభిస్తుందని సెబీ నోటిఫికేషన్‌ చెబుతోంది. డిపాజిటరీల అనుబంధ సంస్థలు, స్టాక్‌ ఎక్స్ఛేంజీలు ఈ ధ్రువపత్రాలను జారీ చేస్తాయి.

ఎవరెవరికంటే...

వ్యక్తి, హెచ్‌యూఎఫ్, కుటుంబ ట్రస్టు, ఏక యాజమాన్య సంస్థలకు రూ.2 కోట్ల వార్షిక ఆదాయం లేదా రూ.7.50 కోట్ల నికర విలువ ఉండాలి. ఇందులో సగం ఆర్థిక ఆస్తుల రూపంలో ఉండాలి.

  • సంస్థలకైతే కనీసం రూ.కోటి వార్షికాదాయం, రూ.5 కోట్ల నికర విలువ ఉండాలి. అందులో కనీసం సగం ఆర్థిక ఆస్తుల రూపంలో ఉండాలి.
  • కుటుంబ ట్రస్టులు కాని ట్రస్టుల విషయంలో కనీసం రూ.50 కోట్ల నికర విలువ ఉండాలి.
  • కార్పొరేట్లకు రూ.50 కోట్ల నికర విలువుండాలి

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, అవి ఏర్పాటు చేసిన ఫండ్‌లు, డెవలప్‌మెంటల్‌ ఏజెన్సీలు, సంస్థాగత కొనుగోలుదార్లు, క్యాటగరీ 1 ఎఫ్‌పీఐలు, సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌లు, మల్టీలేటరల్‌ ఏజెన్సీలు గుర్తింపు పొందిన మదుపర్లుగానే ఉంటారు.

ప్రయోజనాలు...

ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ నిబంధనల్లో సూచించిన కనీస మొత్తం కంటే తక్కువ పెట్టుబడితో ఆయా పెట్టుబడి ఉత్పత్తుల్లో పాల్గొనడానికి గుర్తింపు పొందిన మదుపర్లకు వీలుంటుంది.

సులభతర వ్యాపార నిర్వహణకు చర్యలు...

కొత్త తరం టెక్నాలజీ కంపెనీలు సులభతర వ్యాపారం నిర్వహించుకునేందుకు వీలుగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పలు చర్యలు చేపట్టింది. స్వెట్‌ ఈక్విటీ నిబంధనలు సడలించడంతో పాటు అనుమతుల భారాన్ని తగ్గించే నిర్ణయాలకు శుక్రవారం సెబీ బోర్డు ఆమోదం తెలిపింది. నమోదిత కంపెనీల్లో ప్రమోటర్ల విధానాన్ని పక్కనపెట్టి, నియంత్రిత వాటాదార్లు అనే భావనను తీసుకురావడమే కాకుండా, తొలి పబ్లిక్‌ ఇష్యూలో షేర్ల విక్రయం తర్వాత ప్రమోటర్లకు కనీస లాక్‌ఇన్‌ పీరియడ్‌ను తగ్గించేందుకు బోర్డు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులను (ఏఐఎఫ్‌) నియంత్రించే నిబంధనల సవరణలను సెబీ బోర్డు ఆమోదించింది.

  • దేశ విదేశాల నుంచి అంకుర సంస్థలు ఆకర్షించే పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలను సవరించింది. ఇన్నోవేటర్స్‌ గ్రోత్‌ ప్లాట్‌ఫామ్‌పై (ఐజీపీ) నమోదైన కొత్త తరం టెక్నాలజీ కంపెనీల వార్షిక స్వెట్‌ ఈక్విటీ షేర్ల సీలింగ్‌ను 15 శాతానికి, మొత్తం సీలింగ్‌ను పెయిడప్‌ క్యాపిటల్‌లో 50 శాతానికి పరిమితం చేసింది. పెంచిన ఈ మొత్తం పరిమితి కంపెనీ వ్యవస్థాపితం నుంచి 10 ఏళ్ల వరకు వర్తిస్తుంది.

ఇదీ చదవండి:'డిసెంబరుకు డిజిటల్‌ కరెన్సీ నమూనా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.