ETV Bharat / business

రెండు నెలల్లో 36 లక్షల మంది ఈపీఎఫ్​ ఉపసంహరణ

లాక్​డౌన్​ విధించిన రెండు నెలల్లో 36 లక్షల మంది 11,540 కోట్ల రూపాయలను తమ ఈపీఎఫ్​ ఖాతా నుంచి ఉపసంహరించుకున్నట్లు కార్మిక శాఖ తెలిపింది. కరోనా కష్టకాలంలో ఉద్యోగులకు సేవలు అందించటంలో సమర్ధంగా పని చేసినట్లు ఈపీఎఫ్​ఓను కార్మిక శాఖ పొగిడింది.

EPFO settles 36.02 lakh claims worth Rs 11,540 cr in April-May
రెండు నెలల్లో 36 లక్షల మంది ఈపీఎఫ్​ఓ ఉపసంహరణ
author img

By

Published : Jun 9, 2020, 7:46 PM IST

లాక్​డౌన్​ అమలైన గత రెండు నెలల కాలంలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్​ఓ11వేల 540 కోట్ల రూపాయలను ఉద్యోగులు ఉపసంహరించుకున్నట్లు కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. దీనివల్ల 36లక్షల మంది ఉద్యోగులు ప్రయోజనం పొందారని వెల్లడించింది. ఇందులో ప్రధానమంత్రి గరీబ్​ కల్యాణ్​ యోజన కింద 15లక్షల 54వేల మంది ఈపీఎఫ్​ఓ సభ్యులు.. కొవిడ్అడ్వాన్స్ కింద 4వేల 580 కోట్ల రూపాయలను ఉపసంహరించుకున్నట్లు తెలిపింది.

అంతే కాకుండా నెల జీతం 15వేల రూపాయల కంటే తక్కువ ఉన్న ఉద్యోగులకు తమ ఖాతాలోని 75శాతం నగదును కొవిడ్ అడ్వాన్స్​గా తీసుకునేందుకు ఇటీవల కేంద్రం అనుమతిచ్చింది. డబ్బు ఉపసంహరించుకున్న వారిలో వీరి సంఖ్య 74శాతం ఉండగా, 50వేల రూపాయల కంటే ఎక్కువ నెలజీతం ఉన్న వారి సంఖ్య 2శాతం ఉందని కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది. 15వేల నుంచి 50వేల నెల జీతం ఉన్న వారు 24శాతం మంది డబ్బు ఉపసంహరించుకున్నట్లు తెలిపింది.

ఏప్రిల్​- మే నెలలో మొత్తం 36.02 లక్షల క్లెయిమ్స్​ నమోదవ్వగా వీటిలో 33.75 లక్షల క్లైయిమ్స్​ను పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. విధులకు 50 శాతం మందే హాజరైనప్పటికి వీటిని పూర్తి చేసినట్లు వెల్లడించారు.

ఇదీచూడండి:ఐటీఆర్​-1 ఫారంతో రిటర్నుల దాఖలు ఇలా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.