2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈపీఎఫ్‌పై 8.5శాతం వడ్డీలో కొంత భాగాన్ని చెల్లించాలని నిర్ణయించింది ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ). తొలుత 8.15శాతం వడ్డీని జమ చేయనుంది. మిగతా 0.35శాతం వడ్డీని డిసెంబర్‌లో చెల్లిస్తామని తెలిపింది. దాదాపు 6కోట్ల మంది ఉద్యోగులకు దీని ద్వారా ప్రయోజనం కలగనుందని వివరించింది.
ఉద్యోగులకు 8.5శాతం వడ్డీని అందిస్తామని ఈపీఎఫ్‌ఓ మార్చి నెలలోనే ప్రకటించింది. ఇప్పుడు అందులో కొంత భాగం చెల్లించేందుకు ట్రస్టీల బోర్డు ఆమోదం తెలిపింది.
ఇదీ చూడండి:- జూన్‌లో 6.55 లక్షల కొత్త ఉద్యోగాలు