ETV Bharat / business

ఈపీఎఫ్ చందాదారులకు షాక్.. డిపాజిట్లపై వడ్డీ రేటు తగ్గింపు

ఈపీఎఫ్​ డిపాజిట్లపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను వడ్డీ రేటు 8.50 శాతంగా నిర్ణయించింది కార్మిక శాఖ. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే వడ్డీ రేటును స్వల్పంగా తగ్గించింది.

epfo cuts intrest rate
ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటు తగ్గింపు
author img

By

Published : Mar 5, 2020, 2:01 PM IST

ఈపీఎఫ్​ చందాదారులకు కేంద్రం షాకిచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2019-20) సంబంధించి ఈపీఎఫ్​ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.50 శాతంగా నిర్ణయించినట్లు కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వార్ తెలిపారు.

నేడు జరిగిన ఉద్యోగుల భవిష్య నిధి సంఘం (ఈపీఎఫ్​ఓ).. సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ ట్రస్టీస్​(సీబీటీ) భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్మిక శాఖ ప్రతిపాదనకు ఆర్థిక శాఖ ఆమోదం లభించాల్సి ఉంది.

గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో ఆరు కోట్ల మంది ఈపీఎఫ్​ చందాదారులకు లబ్ధి చేకూరే విధంగా డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీని ఇవ్వటం గమనార్హం.

గతంలో ఈపీఎఫ్​ వడ్డీ రేట్లు..

  • 2017-18లో 8.55 శాతం
  • 2016-17లో 8.65 శాతం
  • 2015-16లో 8.88 శాతం
  • 2014-15లో 8.75 శాతం
  • 2013-14లో 8.75 శాతం
  • 2012-13లో 8.50 శాతం

ఇదీ చూడండి:భారత్‌లో ఉద్యోగుల వేతనాల పెంపు 7.8 శాతమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.