గత ఆగస్టులో 14.81 లక్షల మంది కొత్త చందాదార్లు జతయ్యారని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లో నికర ఉద్యోగాల్లో వృద్ధి ధోరణి కనిపిస్తోందని పేర్కొంది. 2021 జులైలో జతయిన చందాదార్లతో పోలిస్తే ఆగస్టులో 12.61 శాతం మేర వృద్ధి నమోదైంది. ఆగస్టు నాటి 14.81 లక్షల మంది నికర చందాదార్లలో, 9.19 లక్షల మంది తొలిసారిగా ఈపీఎఫ్‌ఓ సామాజిక భద్రత పథకంలోకి వచ్చారని తెలిపింది.
5.62 లక్షల మంది నికర చందాదార్లు ఈపీఎఫ్‌ఓను వదిలి, కొత్త ఉద్యోగాల ద్వారా మళ్లీ పథకంలోకి వచ్చినట్లు తెలిపింది. 22-25 ఏళ్ల మధ్య వయసున్న వారు 4.03 లక్షల మంది ఆగస్టులో కొత్తగా నమోదు చేసుకోగా, 18-21 ఏళ్ల మధ్య ఉన్న వారు 3.25 లక్షల మంది నమోదు చేసుకున్నారని ఈపీఎఫ్‌ఓ వెల్లడించింది.
ఇవీ చదవండి: