EPF nomination deadline: ఈపీఎఫ్ఓ చందాదారులకు గుడ్ న్యూస్. ఇప్పటి వరకు ఈ-నామినేషన్ జత చేయలేదా? చివరి తేది సమీపిస్తుందని ఆందోళన చెందుతున్నరా? డిసెంబరు 31 తర్వాత కూడా ఈ-నామినేషన్ జత చేయవచ్చు.
చందాదారుల సంబంధిత పీపీఎఫ్ ఖాతాకు నామినీ వివరాలను జత చేయాలని ప్రయత్నించినప్పటికీ, ఈపీఎఫ్ఓ పోర్టల్ సర్వర్ డౌన్ అవ్వడం సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో పలువురు వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదును దృష్టిలో ఉంచుకుని ఈపీఎఫ్ఓ ఈ మేరకు ట్వీట్ చేసింది. దీని ప్రకారం చందాదారులు డిసెంబరు 31 తర్వాత కూడా ఈ-నామినేషన్ దాఖలు చేయవచ్చు. అయితే ఈ రోజే నామినేషన్ దాఖలు చేయమని ఈపీఎఫ్ఓ ట్వీట్‌లో పేర్కొంది. అలాగే దీనికి ఇప్పటివరకు ఎలాంటి గడువు తేదీ నిర్ణయించలేదని తెపింది.
ఈపీఎఫ్ఓ ప్రకారం చందాదారులు, ప్రావిడెండ్ ఫండ్(పీఎఫ్), పెన్షన్(ఈపీఎస్), చందాదారుల మరణానంతరం కుటుంబ సభ్యులు బీమా(ఈడిఎల్ఐ) ప్రయోజనాలను పొందేందుకు, అలాగే నామినీ సులభంగా ఆన్‌లైన్ క్లెయిమ్ ఫైల్ చేయడాన్ని ఈ-నామినేషన్ సులభతరం చేస్తుంది.
పీఎఫ్ నామినేషన్ ఆన్‌లైన్‌లో దాఖలు చేసే విధానం..
- ముందుగా epfindia.gov.in లో లాగిన్ అవ్వండి.
- సర్వీసెస్ సెక్షన్‌కి వెళ్లి, ఫర్ ఎంప్లాయిస్ బటన్‌పై క్లిక్ చేయండి.
- ఆపై మెంబర్ యూఏఎన్ లేదా ఆన్‌లైన్ సర్వీసెస్(ఓసీఎస్/ఓటీసీపీ) బటన్‌పై క్లిక్ చేయండి.
- మీ యూఏఎన్, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయండి.
- మేనేజ్ బటన్ క్రింద ఈ-నామినేషన్ సెలక్ట్ చేయండి.
- మీ ఫ్యామిలి డిక్లరేషన్ అప్‌డేట్ కోసం Yes పై క్లిక్ చేయండి.
- 'యాడ్ ఫ్యామిలీ డిటేల్స్' బటన్‌పై క్లిక్ చేసి వివరాలు ఇవ్వండి.
- పీఎఫ్ మొత్తంలో ఎవరెవరికి ఎంతెంత మొత్తం ఇవ్వాలో తెలియజేసేందుకు..'నామినేషన్ డిటేల్స్' పై క్లిక్ చేయండి.
- డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత, 'సేవ్ ఈపీఎఫ్ నామినేషన్' పై క్లిక్ చేయండి
- ఓటీపీ కోసం 'E-Sign' బటన్‌పై క్లిక్ చేయండి.
- ఆధార్ కార్డ్‌తో లింక్ చేయబడిన మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది
- ఓటీపీని ఎంటర్ చేస్తే ఈపీఎఫ్‌లో మీ ఈ-నామినేషన్ నమోదు ప్రక్రియ విజయవంతం అవుతుంది.
ఈపీఎఫ్‌వో సభ్యులు తమ కుటుంబాలకు సామాజిక భద్రత అందించడానికి ఈ రోజే ఈ-నామినేషన్‌ను దాఖలు చేయండి. నామినేషన్ డిజిటల్‌గా దాఖలు చేయడానికి పైనున్నస్టెప్పులు అనుసరిస్తే సరిపోతుంది. సభ్యులు ఒకటి కంటే ఎక్కువ సార్లు పీఎఫ్ నామినీని జోడించవచ్చు. ఈపీఎఫ్ నామినేషన్ ఆన్‌లైన్‌లో దాఖలు చేసిన తర్వాత దీనికి సంబంధించిన పత్రాలను నేరుగా ఇవ్వవలసిన అవసరం లేదు.
ఇదీ చూడండి: Cryptocurrency in India: అనిశ్చితి, అస్థిరతలోనూ క్రిప్టోకు ఆదరణ!