ETV Bharat / business

ఈసారి 'డాజ్​ కాయిన్'​కు హిట్​​ ఇచ్చిన మస్క్​! - ఎలాన్​ మస్క్​ ట్వీట్లు

టెస్లా అధినేత ఎలాన్​ మస్క్​ ట్వీట్లకు ఆయన ఫాలోవర్స్​ ఎప్పుడూ బ్రహ్మరథం పడుతూనే ఉంటారు. తాజాగా ఆయన ట్విట్టర్​లో 'డాజ్'​ అనే ఒక్క పదాన్ని చేశారు. అంతే.. కొన్ని గంటల్లోనే డాజ్​ కాయిన్ (క్రిప్టోకరెన్సీ)​ విలువ 50 శాతం పెరిగింది.

Elon Musk's tweet
ఈసారి 'డాజ్​కాయిన్'​కు హిట్​ ఇచ్చిన మస్క్​ ​
author img

By

Published : Feb 5, 2021, 5:13 AM IST

ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ సంస్థ 'టెస్లా' అధినేత ఎలాన్‌ మస్క్‌ ఇప్పుడు ఏం చేసినా అది సంచలనంగానే మారుతోంది. ఆయన వేసే ప్రతి అడుగుని యావత్ ప్రపంచం నిశితంగా గమనిస్తోంది. తాజాగా ఆయన ట్విట్టర్​లో డాజ్​ కాయిన్​ గురించి పలు పోస్టులు పెట్టారు. "డాజ్​కాయిన్​ ప్రజల క్రిప్టో" అని మస్క్​ అందులో పేర్కొన్నారు. దీనితో.. డాజ్​కాయిన్​ విలువ.. కొన్ని గంటల్లోనే 50 శాతం పెరిగింది.

కుక్కకు గిఫ్ట్​..

మస్క్​ ట్వీట్లకు ఆయన ఫాలోవర్స్​ ఎప్పుడూ బ్రహ్మరథం పడుతూనే ఉంటారు. గతంలో తనకు 'ఎట్సీ' అనే ఓ ఈ-కామర్స్​ కంపెనీ ఇష్టమని మస్క్​ ఓ ట్వీట్​ చేశారు. ఆ కంపెనీ నుంచి తన కుక్కపిల్లకు ఓ గిఫ్ట్ కూడా కొన్నానని ట్విట్టర్​లో పేర్కొన్నారు. ఈ ట్వీట్​తో అమెరికా మార్కెట్లలో 'ఎట్సీ' షేర్లు ఇంట్రాడేలో(జనవరి 26న) రికార్డు స్థాయిలో 8శాతానికిపైగా పెరిగాయి.

రాంగ్​ సిగ్నల్..

జనవరి 7న కూడా ఎలాన్‌ మస్క్‌ తన ట్విట్టర్​ ఖాతాలో సిగ్నల్​ అనే సామాజిక మాధ్యమం గురించి చెబుతూ.. 'యూజ్‌ సిగ్నల్‌' అనే సందేశాన్ని పోస్ట్‌ చేశారు. దీన్ని తప్పుగా అర్థం చేసుకున్న మదుపర్లు.. 'సిగ్నల్‌ అడ్వాన్స్‌' అనే పేరు ఉన్న ఓ చిన్న వైద్యపరికరాల తయారీ కంపెనీపై దృష్టి సారించారు. బహుశా దీన్నే మస్క్‌ ప్రమోట్‌ చేసి ఉంటారని ఆ కంపెనీ షేర్లపై పడ్డారు. దీంతో ఆ కంపెనీ షేర్ల విలువ జనవరి 7న ఆరింతలైంది. మూడు రోజుల్లో అమాంతం 5,100శాతం పెరిగింది.

ఇదీ చదవండి:పరువు నష్టం కేసులో ఎలాన్​ మస్క్​కు చుక్కెదురు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.