ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా షేర్లు శుక్రవారం భారీ నష్టాన్ని నమోదు చేశాయి. 'కంపెనీ షేరు ధర మరీ ఎక్కువగా ఉంది' అంటూ సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ ఇందుకు కారణమైంది.
-
Tesla stock price is too high imo
— Elon Musk (@elonmusk) May 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Tesla stock price is too high imo
— Elon Musk (@elonmusk) May 1, 2020Tesla stock price is too high imo
— Elon Musk (@elonmusk) May 1, 2020
'నా చరాస్థులన్నీ దాదాపు అమ్మేస్తున్నా. చివరకు సొంత ఇల్లు కూడా ఉండకపోవచ్చు' అని మస్క్ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. లాక్డౌన్ నుంచి వెంటనే ప్రజలకు స్వేచ్ఛను తిరిగివ్వాలని ప్రభుత్వానికి సూచించారు.
-
I am selling almost all physical possessions. Will own no house.
— Elon Musk (@elonmusk) May 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I am selling almost all physical possessions. Will own no house.
— Elon Musk (@elonmusk) May 1, 2020I am selling almost all physical possessions. Will own no house.
— Elon Musk (@elonmusk) May 1, 2020
మస్క్ చేసిన ఈ ట్వీట్లతో సంస్థ షేరు విలువ 80.56 డాలర్ల నష్టంతో 701.32 డాలర్లకు పడిపోయింది.
అంతకు ముందు (ఈ వారం మొదట్లో) టెస్లా ఫలితాల ప్రకటన సందర్భంగా.. లాక్డౌన్ విధింపుపై ప్రభుత్వాన్ని ఎలాన్ మస్క్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజల హక్కులను హరించి బలవంతంగా వారిని ఇళ్లల్లో నిర్బంధించారని ఆరోపించారు.
కరోనా కట్టడికి గాను ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ఫ్రీమోంట్, కాలిఫోర్నియాల్లోని టెస్లా ప్లాంట్లు మార్చి 23 నుంచి ముతపడ్డాయి.
ఇదీ చూడండి:రానున్న రోజుల్లో టెలీమెడిసిన్దే హవా!