ETV Bharat / business

రానున్న రోజుల్లో టెలీమెడిసిన్​దే హవా! - టెలిమెడిసిన్ ఉపయోగాలు

టెలీమెడిసిన్.. మొన్నటి వరకు పెద్దగా ఆదరణలేని ఆన్​లైన్ వైద్య సేవల రంగం. కానీ ఇప్పుడు దీనికి డిమాండ్ భారీగా పెరిగింది. కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్​డౌన్ ఇందుకు ప్రధాన కారణం. టెలీమెడిసిన్​కు ఉన్న ఫళంగా ఆదరణ ఎలా పెరిగింది? భవిష్యత్​లో వైద్య రంగాన్ని టెలీమెడిసిన్ ఎలా ప్రభావితం చేయనుంది? నిపుణుల మాటేంటి?

huge investments In telemedicine
టెలిమెడిసిన్​లో భారీ పెట్టుబడులు
author img

By

Published : May 2, 2020, 1:16 PM IST

కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రస్తుతం లాక్​డౌన్​ కొనసాగుతోంది. మార్చి చివరి వారం నుంచి ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడు మరోసారి మే 17 వరకు లాక్​డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే ఈ సమయంలో టెలీమెడిసిన్​కు ఆదరణ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.

టెలీకమ్యూనికేషన్ ద్వారా వైద్యులతో ఆరోగ్య సలహాలు తీసుకోడమే టెలీమెడిసిన్.

అప్పుడు వద్దనుకున్నా...

వీడియో కాల్​లు, వీడియో కాన్ఫరెన్సింగ్​లు, సందేశాల ద్వారా డాక్టర్లను సంప్రదించడం వంటి వాటికి గతంలో పెద్దగా ఆదరణ ఉండేది కాదు. లాక్​డౌన్ కారణంగా ఇప్పుడు మాత్రం వాటిపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఆన్​​లైన్​లో ఆరోగ్య సేవలు అందించే ప్రాక్టో, డాక్స్​యాప్, ఎంఫైన్ వంటి యాప్​లనూ ఎక్కువగా వినియోగిస్తున్నారు.

ప్రత్యేక దృష్టి..

ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య రంగంలో పేరొందిన దిగ్గజ సంస్థలు టెలీమెడిసిన్​పై ప్రత్యేక దృష్టిసారిస్తున్నాయి. నారాయణ హృదయాలయ, అపోలో టెలీమెడిసిన్ ఎంటర్​ప్రైజెస్, ఏషియా హార్ట్ పౌండేషన్​, ఎస్కార్ట్ హార్ట్ ఇన్​స్టిట్యూషన్, అరవింద్​ ఐ కేర్ వంటి సంస్థలు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. భవిష్యత్​లో టెలీమెడిసిన్​కు రానున్న డిమాండ్​ను ముందే పసిగట్టి.. వాటిని అందిపుచ్చునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. అధునాతన సాంకేతికత కోసం ఇస్రో వంటి సంస్థల సహాయం తీసుకుంటున్నాయి.

టెలీమెడిసిన్​తో లాభాలు..

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) సిఫార్సుల ప్రకారం వైద్యులు, జనాభా నిష్పత్తి 1:1000గా ఉండాలి. కానీ మన దేశంలో అది 0.62:1000గా ఉంది. ఈ లోటును భర్తీ చేయడంలో టెలీమెడిసిన్ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు.

టెలీమెడిసిన్​ ద్వారా ప్రయాణ ఖర్చులు, సమయం, వైద్య ఖర్చులు తగ్గుతాయని అంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నిపుణులైన వైద్యులను సంప్రదించడం సులభమవుతుందని చెబుతున్నారు.

భారత్​కు 5 బిలియన్ డాలర్లు ఆదా..

టెలీమెడిసిన్​ను అభివృద్ధి చేస్తే భారత్​కు ఏటా 4 నుంచి 5 బిలియన్ డాలర్లు ఆదా అవుతుందని మిక్కిన్సి గ్లోబల్ ఇన్​స్టిట్యూట్ (ఎంజీఐ) 2019లో విడుదల చేసిన ఓ నివేదికలో అంచనా వేసింది.

'గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు స్థానికంగా ఉండే అర్హత లేని వైద్యులపై ఆధారపడకుండా నేరుగా నిపుణులనే సంప్రదించే వీలుంటుంది. వైద్యులను సంప్రదించేందుకు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పట్టణాలకు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. టెలీమెడిసిన్ ద్వారా ఆ ప్రయాణాల భారం కూడా తగ్గుతుంది' అని నిపుణులు అభిప్రాయపడ్డట్లు నివేదికలో పేర్కొంది మిక్కిన్సి.

టెలీమెడిసిన్​కు సవాళ్లు..

టెలీమెడిసిన్​ వల్ల ఉపయోగాలు ఉన్నప్పటికీ.. సరైన సాంకేతిక మౌలిక సదుపాయాలు లేకపోవడం, టెలీమెడిసిన్ వైద్యులకు తక్కువ పారితోషికాలు ఉండటం వంటివి సవాళ్లుగా ఉన్నాయి. మరోవైపు టెలీమెడిసిన్​ను సంప్రదించే రోగులకు వారి వ్యక్తిగత గోప్యతపై అనుమానాలు ఉండటం, సరైన అవగాహన లేకపోవడం వంటివి సమస్యలేనని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా చాలా మంది వైద్యుడ్ని నేరుగా కలిసినప్పుడు మాత్రమే చికిత్సపై నమ్మకంగా ఉంటున్నారు. ఇది కూడా టెలీమెడిసిన్​కు అడ్డంకిగా ఉన్నట్లు చెబుతున్నారు.

కరోనా కారణంగా టెలీమెడిసిన్​ అభివృద్ధికి మరోసారి అవకాశం దొరికింది. రానున్న రోజుల్లో టెలీమెడిసిన్​ ఆరోగ్య సంరక్షణ రంగంలో ముఖ్య పాత్ర పోషించే ఆస్కారముంది. ఇలాంటి పరిస్థితుల్లో టెలీమెడిసిన్​కు కావాల్సిన మౌలిక సదుపాయాలు, నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. కరోనా సంక్షోభం ముగిసినా టెలీమెడిసిన్​కు మాత్రం ఆదరణ తగ్గకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు.

ఇదీ చూడండి:ఆర్థిక ప్రణాళిక ఇలా ఉంటే కరోనా కష్టాల్లోనూ బేఫికర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.