ETV Bharat / business

Covid-19: మరో కొత్త డ్రగ్​కు అనుమతులు

కరోనా చికిత్స కోసం ఎలి లిల్లీ అండ్​ కంపెనీ అభివృద్ధి చేసిన యాంటీ బాడీ డ్రగ్​ కాంబినేషన్​కు షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది కేంద్రం. లక్షణాలు స్వల్పంగా- తక్కువ తీవ్రత ఉన్న వారికి ఈ ఔషధాన్ని అందించవచ్చని సంస్థ పేర్కొంది.

Eli lilly India Antibody drug
మరో కొత్త డ్రగ్​కు అనుమతులు
author img

By

Published : Jun 1, 2021, 5:33 PM IST

ఎలి లిల్లీ అండ్ కంపెనీ ఇండియా అభివృద్ధి చేసిన యాంటీ బాడీ డ్రగ్స్ కాంబినేషన్‌కు కరోనా చికిత్సలో అత్యసర వినియోగానికి షరతులతో కూడిన అనుమతులు లభించాయి. ఈ మేరకు ఎలి లిల్లీ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.

తాము అభివృద్ధి చేసిన ఔషధాన్ని స్వల్ప లక్షణాల నుంచి తీవ్రత తక్కువగా ఉన్న కేసుల్లో.. చికిత్సకు ఉపయోగించవచ్చని ఎలి లిల్లీ వెల్లడించింది. బామ్లానివిమాబ్‌ 700ఎంజీ, ఎటిసీవిమాబ్ 1400 ఎంజీ మందులను కలిపి కాక్‌టైల్‌గా రోగులకు ఇస్తే మంచి ఫలితాలు వస్తున్నట్లు.. ఎలి లిల్లీ వివరించింది. ఈ కాక్‌టైల్‌కు అమెరికాతో పాటు.. ఐరోపా దేశాల్లో అత్యసర వినియోగానికి అనుమతి ఉంది.

ఇప్పటికే ఈ సంస్థ అభివృద్ధి చేసిన బారిసిటినిబ్‌ను రెమ్‌డెసివర్‌తో కలిపి కరోనా చికిత్సలో వాడేందుకు ఇప్పటికే భారత్‌లో అత్యవసర అనుమతి ఉంది.

ఇదీ చూడండి:- 2డీజీ డ్రగ్ వాడాలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.