ETV Bharat / business

బిట్​కాయిన్​ను చట్టబద్ధం చేసిన తొలి దేశం ఇదే... - is bitcoin legal in el salvador

సెంట్రల్​ అమెరికాలోని ఎల్​ సాల్వడార్​ బిట్​కాయిన్​ను చట్టబద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన బిల్లును అక్కడి చట్టసభ ఆమోదం తెలిపినట్లు ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించారు.

bit coin
బిట్​కాయిన్​
author img

By

Published : Jun 9, 2021, 6:56 PM IST

ప్రముఖ క్రిప్టోకరెన్సీగా పేరొందిన బిట్​కాయిన్​ ఇకపై మధ్య అమెరికాలోని ఎల్​ సాల్వడార్​లో అధికారికంగా చెల్లుబాటు కానుంది. ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందినట్లు ఆ దేశాధ్యక్షుడు నయిబ్​ బుకేలే ప్రకటించారు. ఈ నిర్ణయంతో ప్రపంచంలోనే బిట్​కాయిన్​కు తొలిసారి చట్టబద్ధత కల్పించిన దేశంగా ఎల్​సాల్వడార్​ నిలిచింది.

బిట్​కాయిన్​కు చట్టబద్ధత కల్పించే బిల్లు ఎల్​ సాల్వడార్​ కాంగ్రెస్​ సూపర్​ మెజారిటీతో ఆమోదం పొందింది. 84 మంది చట్ట సభ్యులు ఉన్న సభలో 64 మంది మద్దతు తెలిపారు. ఇది చారిత్రకమని నయిబ్​ బుకేలే ట్వీట్​ చేశారు.

ఇదీ చూడండి: కుబేరులే కానీ.. ఆదాయపు పన్ను చెల్లించరట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.