టెస్లా కార్లలానే.. ఆ సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ సంపద కూడా దూసుకుపోతోంది. అమెరికా స్టాక్ మార్కెట్లలో సోమవారం టెస్లా షేర్లు 12 శాతానికిపైగా పుంజుకోవడం వల్ల మస్క్ సంపద 115.4 బిలియన్ డాలర్లు దాటినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదిక తెలిపింది. ఇందులో కేవలం ఈ ఏడాదే 87.8 బిలియన్ డాలర్ల సంపదను మస్క్ ఆర్జించడం గమనార్హం. టెస్లా షేర్లు ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 500 శాతం పెరిగాయి.
ఈ స్థాయిలో సంపద వృద్ధితో ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌ను వెనక్కు నెట్టి ప్రపంచంలోనే మూడో అత్యంత సంపన్నుడిగా మారారు ఎలాన్ మస్క్. బ్లూమ్‌బర్ల్ ప్రకారం మార్క్ జుకర్‌బర్గ్ సంపద ప్రస్తుతం 110.8 డాలర్లుగా ఉంది. మస్క్ కన్నా ముందు అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ (200 బిలియన్ డాలర్లకు పైమాటే) అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ రెండో స్థానంలో ఉన్నారు.
అత్యంత సంపన్న మహిళగా మెకాంజీ
జెఫ్ బెజోస్.. మాజీ భార్య మెకాంజీ సంపద కూడా సోమవారం భారీగా పెరిగింది. బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్ ప్రకారం.. ఆమె మొత్తం సంపద ప్రస్తుతం 66.4 బిలియన్ డాలర్లు. సోమవారం పెరిగిన సంపదతో మెకాంజీ ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళగా అవతరించారు.
ఇదీ చూడండి:'రుణాలపై రెండేళ్ల పాటు మారటోరియం పొడిగింపు!'