ETV Bharat / business

ఆ రంగాల్లో పెరిగిన నియామకాలు.. కానీ! - విద్యా రంగంలో నియామకాలకు పెరిగేదుకు కారణాలు

విద్యా, బోధన విభాగంలో 2021 జనవరిలో నియామకాలు 2020 డిసెంబర్​తో పోలిస్తే 11 శాతం పెరిగాయి. వివిధ రంగాల్లో గత నెల నియామకాలు సానుకూలంగా ఉన్నప్పటికీ.. 2020 జనవరితో పోలిస్తే మాత్రం 19 శాతం తగ్గినట్లు ఓ సర్వేలో వెల్లడైంది. ఆ సర్వేలోని విశేషాలు మీ కోసం.

Job hiring rise in January
దేశంలో పెరిగిన నియామకాలు
author img

By

Published : Feb 11, 2021, 6:03 PM IST

కరోనా సంక్షోభం తర్వాత పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న నేపథ్యంలో విద్య, రియాల్టీ, బీమా సహా పలు రంగాల్లో నియామకాలు పుంజుకుంటున్నాయి. అయినప్పటికీ గత ఏడాది డిసెంబర్​తో పోలిస్తే మాత్రం జనవరిలో నియమాకాలు దాదాపు ఫ్లాట్​గా ఉన్నట్లు ప్రముఖ జాబ్​ సెర్చ్ పోర్టల్​ నౌక్రీ నివేదిక వెల్లడించింది.

నివేదికలోని ముఖ్యాంశాలు..

  • గత ఏడాదితో మొదటి నెలతో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో ఉద్యోగ నియామకాలు 19 శాతం తగ్గాయి.
  • విద్యా, బోధన విభాగంలో 2021 జనవరిలో నియామకాలు 2020 డిసెంబర్​తో పోలిస్తే 11 శాతం పెరిగాయి. చాలా ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోవడం ఇందుకు ప్రధాన కారణం.
  • బీమా రంగంలో నియామకాలు 2020 డిసెంబర్​తో పోలిస్తే 2021 జనవరిలో 8 శాతం పెరిగాయి. ఆరోగ్య బీమాకు డిమాండ్ పెరగటం ఇందుకు కారణం.
  • రియాల్టీ (13 శాతం), రిటైల్​ (7 శాతం), బ్యాంకింగ్, ఫినాన్షియల్ (5 శాతం), బీపీఓ (3 శాతం) వంటి రంగాల్లో నియమాకాలు పెరిగాయి.
  • వాహన రంగం, దాని అనుంబంధ విభాగాల్లో మాత్రం నియామకాలు అత్యధికంగా 14 శాతం క్షీణించాయి. టెలికాం రంగంలోనూ నియామకాలు 8 శాతం పడిపోయాయి.
  • టైర్​ 2 పట్టణాల్లో గతనెల నియామకాలు సానుకూలంగా నమోదయ్యాయి. వడోదరలో అత్యధికంగా 9 శాతం పెరిగాయి. చండీగఢ్​లో 8 శాతం, జైపుర్​లో 6 శాతం చొప్పున వృద్ధి చెందాయి.
  • 2020 జనవరితో పోలిస్తే గత నెల.. 0-3 ఏళ్ల అనుభవమున్న వారి నియామకాలు 26 శాతం, 13 ఏళ్లకుపైగా అనుభవమున్న వారి నియామకాలు 9 శాతం చొప్పున తగ్గాయి.

ఇదీ చదవండి:ఆ ఉద్యోగులకు భారీగా జీతాలు పెంపు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.