ETV Bharat / business

'ఆయిల్ సర్వే'లో విస్తుపోయే నిజాలు.. వంటనూనెలు  కల్తీమయం! - నూనెల నాణ్యత

Edible oil adulteration: దేశవ్యాప్తంగా వినియోగిస్తున్న వంటనూనెల విషయంలో కీలక విషయాలు వెల్లడించింది భారత సురక్షిత ఆహార, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ). 4,461 నూనె నమూనాలను పరిశీలించగా.. అందులో 2.42శాతం నమూనాలు భద్రతా ప్రమాణాలను ఏ మాత్రం పాటించడం లేదని తెలిపింది. 24.2శాతం నమూనాల్లో నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా కరవయ్యాయని చెప్పింది.

edible oil adulteration
ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ ఆయిల్ సర్వే
author img

By

Published : Dec 29, 2021, 8:40 PM IST

Edible oil adulteration: మీ ఇంట్లో మీరు ఏ రకం వంటనూనె వాడుతున్నారు? విటమిన్​ ఏ, విటమిన్​ డీ అంటూ ప్రకటనలతో హోరెత్తిస్తున్న వంటనూనెల కంపెనీల మాటల్లో నిజమెంత? వేరుశనగ నూనెలో నిజంగా వేరుశనగలనే వినియోగిస్తున్నారా? ఇంకా వేరేమైనా కలుపుతున్నారా? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు ఎందుకంటే.. దేశవ్యాప్తంగా మార్కెట్లో దొరికే నూనెల్లో కల్తీ భారీ స్థాయిలో జరుగుతోందట. ఈ విషయాన్ని భారత సురక్షిత ఆహార, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)తెలిపింది. దేశవ్యాప్తంగా దొరికే వంటనూనెలపై ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ ఓ సర్వే నిర్వహించగా అందులో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి.

Fssai survey on oil: మార్కెట్లో లభ్యమవుతున్న నూనెలకు సంబంధించి, భద్రత, నాణ్యత, మిస్​బ్రాండింగ్​ విషయాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ ఈ సర్వే చేసింది. గతేడాది ఆగస్టు 25-27 మధ్య నిర్వహించిన ఈ సర్వే ఫలితాలను బుధవారం విడుదల చేసింది.

  • విడిగా దొరికే నూనెలతో పాటు బ్రాండెడ్​ కంపెనీలకు చెందిన వంటనూనెల నమూనాలు సహా మొత్తం 4,461 నూనె నమూనాలను ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ పరీక్షించింది.
  • అందులో 2.42శాతం నమూనాలు.. భద్రతా ప్రమాణాలను పాటించడం లేదని తేలింది. వాటిలో హానికరకమైన అల్ఫోటాక్సిన్లు, ఎరువుల అవశేషాలు, భార లోహాలు వంటివి అధిక స్థాయిలో ఉన్నాయి.
  • మరో 24.2శాతం(1,080) నమూనాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని తేలింది. అందులో హైడ్రోసియానిక్ యాసిడ్ అవశేషాలు కనిపించాయని ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ తెలిపింది. బుటైరో రిఫ్రాక్టో మీటర్​ నిర్దేశించిన పరిమితులను అందుకోలేకపోయాయని చెప్పింది.
  • ఒకరకం నూనెలో ఇతర నూనెలు కలుపుతున్నారని ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ చెప్పింది. షెల్ఫ్​ లైఫ్​ స్టాండర్డ్ ప్రమాణాలు పాటించడం లేదని చెప్పింది.
  • 12.8శాతం(572) నమూనాల్లో.. లేబుల్ మిస్ బ్రాండింగ్​ చేస్తున్నారని తేలింది. అంటే... తమ నూనెలో విటమిన్​ ఏ, విటమిన్ డీ ఉన్నాయని చెప్పినప్పటికీ అందులో అలాంటి విటమిన్లు ఏం లేకుండా ఉండటం అని అర్థం.

Oil survey results: నూనెల నమూనాలను 15 ప్రత్యేక రకాలుగా వర్గీకరించి ఈ పరీక్షలు నిర్వహించారు. వీటిని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఉన్న 580 జిల్లాల నుంచి సేకరించారు. వీటిని ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ ల్యాబ్​లకు తరలించి అక్కడ పరీక్షలు జరిపారు.

వంటనూనెల్లో కల్తీ జరుగుతోందని సర్వే ఫలితాల్లో తేలిన నేపథ్యంలో.. కల్తీ నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ ఆదేశించింది. వంట నూనెల్లో కల్తీ కాకుండా జాగ్రత్త వహించాలని వ్యవసాయ మంత్రిత్వ శాఖలు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్​లను కోరింది.

ఇదీ చూడండి: ఐటీఆర్​ ఇ-వెరిఫికేషన్‌ గడువు పొడిగింపు

ఇదీ చూడండి: 'పవర్​ సాకెట్​లో కాయిన్​ పెట్టు'.. చిన్నారికి అలెక్సా ఛాలెంజ్.. చివరకు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.