ETV Bharat / business

జెట్​ ఎయిర్​వేస్​ వ్యవస్థాపకుడిపై ఈడీ కేసు నమోదు - జెట్ ఎయిర్​వేస్​

జెట్​ ఎయిర్​వేస్​ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్​ నరేశ్​ గోయల్​పై ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ) అధికారులు మనీ లాండరింగ్​ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆయన నివాసంలో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

ED raid underway at Naresh Goyal's residence in Mumbai
జెట్​ ఎయిర్​వేస్​ వ్యవస్థాపకుడి ఇంట్లో ఈడీ సోదాలు
author img

By

Published : Mar 5, 2020, 1:23 PM IST

జెట్​ ఎయిర్​వేస్​ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్​ నరేశ్​ గోయల్​పై ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ) అధికారులు మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు అధికారులు. ఆస్తుల వివరాలపై ఆరా తీశారు. గతంలో విదేశీ మారక నిర్వహణ చట్టం(ఫెమా) కింద ఈడీ అధికారులు ఆయనపై కేసు నమోదు చేసి ప్రశ్నించారు.

గతంలోనూ...

తాజాగా ముంబయిలోని ఓ ట్రావెల్ సంస్థను గోయల్​ మోసం చేసినట్లు అందిన ఫిర్యాదుతో ముంబయి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. గోయల్ నివాసంలో బుధవారం రాత్రి సోదాలు నిర్వహించిన అధికారులు.. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అనంతరం గోయల్​పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గతంలోనూ గోయల్​, ఆయన కుటుంబ సభ్యులపై ఇటువంటి దాడులే నిర్వహించింది ఈడీ.

భారీగా నిధులు మళ్లింపు!

గతేడాది ఆగస్టులో విదేశీ బ్యాంకు ఖాతాలకు సంబంధించి ముంబయి, దిల్లీలోని గోయల్‌ నివాసాలు, సంస్థల్లో ఈడీ సోదాలు నిర్వహించింది.

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడం వల్ల గతేడాది ఏప్రిల్​లో జెట్ ఎయిర్‌వేస్‌ సర్వీసులు నిలిపి వేసింది. అంతకుముందు మార్చిలో గోయల్.. జెట్‌ ఎయిర్‌వేస్‌ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్‌వేస్‌ నుంచి భారీగా నిధులను మళ్లించినట్లు తెలుస్తోంది.

జెట్​ ఎయిర్​వేస్​ వ్యవస్థాపకుడి ఇంట్లో ఈడీ సోదాలు

ఇదీ చూడండి: భారత్​లో 29 కరోనా కేసులు: రాజ్యసభలో కేంద్ర మంత్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.