ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణ అక్రమాల కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్. ఐసీఐసీఐ మాజీ ముఖ్య కార్యనిర్వహణాధికారి చందాకొచ్చర్ ఇంట్లో సోదాలు జరిపింది. వీడియోకాన్ ప్రతినిధి వేణుగోపాల్ దూత్ వినాసంలోనూ తనిఖీలు చేపట్టింది.
సుమారు ఐదు కార్యాలయాలతో పాటు, ముంబయిలోని ఇళ్లు, మరికొన్ని చోట్ల తనిఖీలు చేపట్టినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు.
వీడియోకాన్‌కు అక్రమ మార్గంలో రూ.1857 కోట్ల రుణాన్ని మంజూరు చేశారని ఆరోపిస్తూ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వేణుగోపాల్‌పై ఈడీ గతంలో కేసు నమోదు చేసింది.