ETV Bharat / business

'ఈ ఏడాది పసిడి డిమాండ్ సానుకూలమే' - బంగారం డిమాండ్​పై గోల్డ్​ కౌన్సిల్ అంచనాలు

కరోనా ప్రభావం నుంచి వేగంగా కోలుకుంటున్న భారత్​లో ఈ ఏడాది బంగారానికి డిమాండ్​ సానుకూలంగా నమోదవ్వచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది. ఈ మేరకు 'గోల్డ్ ఔట్​లుక్​ 2021' పేరుతో విడుదల చేసిన నివేదికలో పలు కీలక విషయాలు వెల్లడించింది.

WGC expectations on Gold Demand
పసిడి డిమాండ్​పై గోల్డ్ కౌన్సిల్​ అంచనాలు
author img

By

Published : Jan 14, 2021, 6:13 PM IST

ఈ ఏడాది దేశంలో పసిడి డిమాండ్ సానుకూలంగా ఉండొచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) అంచనా వేసింది. కరోనా వల్ల ఏర్పడిన అనిశ్చితుల నుంచి పసిడి డిమాండ్ 2021లో రికవరీ అవ్వొచ్చని పేర్కొంది. వినియోగదారుల ధోరణిలోనూ సానుకూలతలు నమోదవ్వచ్చని పేర్కొంది.

నవంబర్​లో దంతేరాస్ పర్వదిన ప్రాథమిక గణాంకాల ప్రకారం నగల డిమాండ్ ఇంకా సగటు కన్నా తక్కువగా ఉన్నప్పటికీ.. గత ఏడాది ఏప్రిల్-జూన్​తో పోలిస్తే.. గణనీయమైన రికవరీ నమోదైనట్లు డబ్ల్యూజీసీ వివరించింది.

'కరోనా మహమ్మారి ప్రారంభంలోనే (2020లో) తీవ్రంగా కుదేలైన చైనా.. ఇతర పాశ్చాత్య దేశాలతో పోలిస్తే వేగంగా మహమ్మారిని నియంత్రించగలిగింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాత్రం ఇంకా ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. ఇలాంటి తరుణంలో ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో మాత్రం పసిడికి డిమాండ్ కాస్త తక్కువగానే ఉండొచ్చు' అని డబ్ల్యూజీసీ వివరించింది.

ఇదీ చూడండి:స్వల్పంగా తగ్గిన బంగారం ధర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.