ETV Bharat / business

ఇకపై విద్యుత్​ వాహనాలకు ఆర్​సీ ఫ్రీ! - ఆర్​సీ ఫీజు చెల్లించకుండా వాహనాల రిజిస్ట్రేషన్

దేశంలో విద్యుత్​ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాటరీ వాహనాల రిజిస్ట్రేషన్​ సర్టిఫికెట్​ను అందించడానికి ఎటువంటి ఫీజు వసూలు చేయకూడదంటూ నోటిఫికేషన్​ను విడుదల చేసింది.

E-vehicles, exemption of RC
విద్యుత్​ వాహనాలు, ఎలక్ట్రిక్​ వాహనాలు
author img

By

Published : Jun 1, 2021, 5:20 PM IST

విద్యుత్​ వాహనాలు వాడకాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాటరీతో నడిచే వాహనాల(బీఓవీ) రిజిస్ట్రేషన్​ సర్టిఫికేట్​ను జారీ లేదా రెన్యువల్​ కోసం చెల్లించాల్సిన ఫీజును మాఫీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్​ను విడుదల చేసింది.

అయితే ఈ ముసాయిదా నోటిఫికేషన్​పై 30 రోజుల్లోగా సామాన్య ప్రజానీకం సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరింది. దేశంలో బీఓవీల వినియోగం పెంచాలని కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు సవరించినట్లు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. రిజిస్ట్రేషన్​ సర్టిఫికెట్​ను పొందేందుకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: GDP Growth: ఈసారి జీడీపీ వృద్ధి 9.3%!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.