కరోనా మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే బయటపడుతున్న నేపథ్యంలో భారతీయ ద్రవ్యపరపతి విధానంలో గణనీయమైన మార్పులు చోటుకోనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురాం రాజన్ తెలిపారు. ఈ మార్పులు బాండు మార్కెట్‌ను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. అధిక ద్రవ్యోల్బణమే ఇందుకు కారణమని వివరించారు.
5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఊవిళ్లూరుతోందని... కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అంత సులభమైన పని కాదని అన్నారు రాజన్.