ETV Bharat / business

డాక్టర్​ రెడ్డీస్ నుంచి క్యాన్సర్​కు కొత్త ఔషధం - డాక్టర్​ రెడ్డీస్​ జెనరిక్​ ఔషధాలు

కెనడాలో క్యాన్సర్​ ఔషధానికి జెనరిక్ వేరియంట్​ను (Reddy-Lenalidomide) విడుదల చేసింది డాక్టర్​ రెడ్డీస్​. హెల్త్ కెనడా (Health Canada) నుంచి పూర్తి అనుమతులు లభించిన తర్వాతే ఈ ఔషధాన్ని మార్కెట్లోకి తెచ్చినట్లు వెల్లడించింది.

Dr reddys new drug
డాక్టర్ రెడ్డీస్​ కొత్త ఔషధం (ప్రతీకాత్మక చిత్రం)
author img

By

Published : Sep 2, 2021, 11:42 AM IST

హైదరాబాద్​కు చెందిన ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్​ ల్యాబొరేటరీస్​.. కెనడాలో మరో ఔషధాన్ని విడుదల చేసింది. క్యాన్సర్​ ఔషధమైన రెవిల్మిడ్​ (Revlimid) (లెనాలిడొమైడ్​)కు జనరిక్​ వేరియంట్​గా ఈ కొత్త క్యాప్సుల్​ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఔషధం పేరు రెడ్డీ-లెనాలిడొమైడ్​ (Reddy-Lenalidomide)గా పేర్కొంది.

మల్టిపుల్​ మైలోమా, మైలోడిస్ప్రాస్టిక్​సిండ్రోమ్​ (Multiple Myeloma and Myelodysplastic Syndrome​)తో బాధపడే వారికి అందుబాటు ధరలో.. ఈ ఔషధాన్ని అందించనున్నట్లు తెలిపింది డాక్టర్​ రెడ్డీస్​. ఈ క్యాప్సుల్​కు కెనడా ఔషధ నియంత్రణ సంస్థ 'హెల్త్​ కెనడా' నుంచి పూర్తి అనుమతులు లభించినట్లు వివరించింది.

ఈ కొత్త జెనరిక్​ ఔషధం​ 2.5 ఎంజీ, 5 ఎంజీ, 10 ఎంజీ, 15 ఎంజీ, 20 ఎంజీ, 25 ఎంజీ డోసుల్లో అందుబాటులో ఉండనున్నట్లు డాక్టర్​ రెడ్డీస్​ వివరించింది.

ఇదీ చదవండి: అరచేతిలో వ్యాక్సిన్ సమాచారం.. జస్ట్ గూగుల్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.