ETV Bharat / business

'కార్డు' లాభాలను అస్సలు వదులుకోవద్దు! - Eenadu Siri story

కొవిడ్‌-19తో ఆన్‌లైన్‌ కొనుగోళ్లు పెరిగాయి. రానున్న పండగల సీజన్‌లో ఇవి మరింత అధికంగా ఉంటాయని ఇప్పటికే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో డెబిట్‌, క్రెడిట్‌, యూపీఐ, నెట్‌బ్యాంకింగ్‌ విధానాల్లో చెల్లింపులు చేయడమూ అధికంగా కనిపిస్తోంది. ఆన్‌లైన్‌ షాపింగ్‌ అనేది కరోనా అనంతర ప్రపంచంలో సర్వసాధారణమైన అంశంగా మారిపోయింది. మరి అలాంటప్పుడు ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేయడానికి అనుకూలమైన చెల్లింపు మార్గం ఏమిటి? అనే ప్రశ్న చాలామందికి వస్తోంది. దీనికి సమాధానం తెలుసుకుందాం..

DON'T MISS CREDIT AND DEBIT CARD BENIFITS IN ANY TRANSACTION
వదులుకోవద్దు.. కార్డు లాభాలను..
author img

By

Published : Oct 4, 2020, 2:33 PM IST

డిజిటల్‌ చెల్లింపుల కోసం అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో దేని ప్రత్యేకత దానిదే. కొన్ని సులువుగా చెల్లింపులను చేసేందుకు ఉపయోగపడితే.. మరికొన్ని వాటిని వాడుకున్నందుకు మనకు అదనంగా రివార్డు పాయింట్లనూ అందిస్తాయి. ఇలాంటి వాటిలో చెప్పుకోవాల్సినవి క్రెడిట్‌ కార్డుల గురించే.. చేతిలో డబ్బు లేకున్నా.. కొంతకాలం పాటు ఖర్చులకు వెసులుబాటు కల్పిస్తాయివి. దీంతో పాటు ప్రతి కొనుగోలు వెంటా ఉచితంగా కొన్ని ప్రయోజనాలనూ అందిస్తుంటాయి. అందులో నగదు వెనక్కి, రివార్డు పాయింట్లలాంటివి ముఖ్యంగా చెప్పుకోవచ్చు. నిత్యం ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు క్రెడిట్‌ కార్డు వాడేవారికి ఈ ప్రయోజనాలు కొన్ని వేల రూపాయలకు చేరతాయని చెప్పొచ్చు.

డబ్బు ఆదా..

మీ దగ్గరున్న క్రెడిట్‌ కార్డులను బట్టి, లావాదేవీల సంఖ్యను బట్టి మీకు వచ్చే రివార్డు పాయింట్లు ఆధారపడి ఉంటాయి. ఈ రివార్డు పాయింట్లు మీరు డబ్బును ఆదా చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ పాయింట్లను పెంచుకునేందుకు మీరు చేయాల్సిందల్లా.. ఆన్‌లైన్‌లో ఏ వస్తువు కొన్నా.. దానికి క్రెడిట్‌ కార్డుతో ఎన్ని పాయింట్లు వస్తున్నాయో ఒకసారి చూసుకోవడమే. ప్రస్తుతం కొన్ని కార్డు సంస్థలు పలు ఇ-కామర్స్‌ సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకొని, ప్రత్యేక రాయితీలనూ ఇస్తున్నాయి. దీంతోపాటు రివార్డు పాయింట్లనూ అందిస్తున్నాయి. ఉదాహరణకు ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు అందిస్తోన్న క్రెడిట్‌ కార్డును ఉపయోగించి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన ప్రతి రూ.100కూ 5 రివార్డు పాయింట్లను అందిస్తోంది. దీంతోపాటు కొన్నింటికి ప్రతి రూ.100 కొనుగోలుకు ఒక పాయింటును అదనంగా ఇస్తోంది. తాను ఒప్పందం కుదుర్చుకున్న ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ నుంచి కొనుగోలు చేసే వారికి ప్రతి రూ.100 ఖర్చు పెడితే.. 10 పాయింట్లనూ అందిస్తోంది. దీనివల్ల మీ కొనుగోళ్లు పెరుగుతున్న కొద్దీ.. పాయింట్లూ జమ అవుతుంటాయి.

ఇతర మార్గాల్లో చెల్లిస్తే..

క్రెడిట్‌ కార్డులతోపాటు ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు నగదు, యూపీఐలనూ వాడుకోవచ్చు. దీంతోపాటు నెట్‌ బ్యాంకింగ్‌నూ ఉపయోగించుకోవచ్చు. కానీ, ఈ మార్గాల్లో చెల్లించడం ద్వారా ఎలాంటి రివార్డు పాయింట్లూ అందవు. ఇలా చెల్లించినప్పుడు రాయితీల్లాంటివీ అందకపోవచ్చు. వీటన్నింటికన్నా.. కాస్త ప్రయోజనం ఉండేది డెబిట్‌ కార్డుతోనే. అయినప్పటికీ ఇవీ పరిమితంగానే ఉంటాయి. కొన్ని సంస్థలు అందించే ప్రీమియం క్రెడిట్‌ కార్డు ద్వారా మరిన్ని అదనపు పాయింట్లు లభిస్తాయి. కానీ, వీటికి వార్షిక రుసుము ఉంటుంది.

అధికంగా రావాలంటే..

మీరు ఉపయోగించే కార్డు నుంచి అదనపు ప్రయోజనాలు పొందాలంటే.. ముందుగా అందులో ఉన్న నిబంధనలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. మీ నిత్య జీవితంలో ఖర్చు పెట్టుకునేందుకు ఉపయోగపడటం సహా.. కొన్ని ప్రత్యేక కొనుగోళ్ల సమయంలో ఎంత వరకూ మనకు ఉపయోగపడుతుందన్నది చూసుకోవాలి. అలాంటి క్రెడిట్‌ కార్డులనే వినియోగించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఉదాహరణకు మీ క్రెడిట్‌ కార్డుతో ఏబీసీ అనే సంస్థ నుంచి కొనుగోళ్లు ఎక్కువగా చేస్తున్నారనుకుందాం.. కానీ, మీ కార్డు ఎక్స్‌వైజెడ్‌ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇలాంటప్పుడు ఆ కార్డును వినియోగించడం ద్వారా మీకు వచ్చే ఫలితాలు తక్కువగానే ఉంటాయి. అలాగే, కొన్ని కార్డులు రివార్డు పాయింట్ల మీద గరిష్ఠ పరిమితిని విధించవచ్చు. ఉదాహరణకు ఒక కార్డు మీరు నెలకు ఎంత కొన్నా.. గరిష్ఠంగా రూ.750 వరకే ప్రయోజనాలు అందిస్తామని చెప్పొచ్చు. కొన్ని ఏడాదిలోపు మీరు పాయింట్లను ఉపయోగించుకోకపోతే రద్దవుతాయని అంటుంటాయి. కొన్ని క్రెడిట్‌ కార్డులు.. ప్రీమియం సేవలను ఉచితంగా పొందేందుకు వీలు కల్పిస్తాయి. ఉదాహరణకు అంతర్జాతీయ, దేశీయ విమానాశ్రయాల్లో లాంజ్‌ను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఇలా మీ అవసరాలకు తగినట్లుగా కార్డును ఎంచుకుంటే.. అధిక ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు.

ఆలస్యం వద్దు..

"క్రెడిట్‌ కార్డు అందించే ప్రయోజనాలు కాస్త ఆకర్షణీయంగానే ఉంటాయి. ఇవన్నీ మీరు బిల్లును సకాలంలో చెల్లించేంత వరకే. బిల్లింగ్‌ తేదీలోపు బకాయి చెల్లించకపోతే.. రుసుములు, వడ్డీ భారాన్ని భరించాల్సిందే. క్రెడిట్‌ కార్డుపై విధించే వడ్డీ ఇతర రుణాలతో పోలిస్తే అధికంగా ఉంటుంది. కాబట్టి, వాడుకున్న మొత్తాన్ని గడువులోపే చెల్లించడం మేలు. ఆలస్యం చేస్తే క్రెడిట్‌ స్కోరుపైనా దీని ప్రభావం ఉంటుంది."

- అధిల్‌ శెట్టి, సీఈఓ, BankBazaar.com

ఇదీ చదవండి: డెబిట్‌, క్రెడిట్‌ కార్డు లావాదేవీలకు అదనపు భద్రత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.