ETV Bharat / business

భారత ఫార్మా సత్తా- టీకాతో 2021కి స్వాగతం - కరోనా వ్యాక్సిన్

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనాకు ముగింపు పలికేందుకు భారత్​ తయారుచేస్తోన్న వ్యాక్సిన్​ వైపు అన్ని దేశాలు చూస్తున్నాయి. కరోనా మొదలైన ఆది నుంచి నేటి వరకు ప్రపంచానికి దిక్సూచిగా వ్యవహరించింది భారత ఫార్మా రంగం. దేశ ప్రజలు 2021కి వ్యాక్సిన్​తో స్వాగతం పలికేలా తీవ్రంగా కృషి చేస్తోంది.

Domestic pharma
సత్తా చాటిన ఫార్మా రంగం- టీకాతో 2021కి స్వాగతం
author img

By

Published : Jan 1, 2021, 7:08 AM IST

చైనాలోని వుహాన్‌ ప్రావిన్స్‌లో కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) విలయతాండవం చేస్తోందని 2020 ప్రారంభంలో తెలిసినా, మనదేశంలో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ మార్చి నెలాఖరు నాటికి మనదేశంలోనూ కరోనా కేసులు కనిపించడం మొదలైంది. నెమ్మదిగా దేశవ్యాప్తంగా కేసులు విస్తరించాయి. దీంతో లాక్‌డౌన్‌, రవాణా ఆంక్షలతో అన్ని రకాల కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ ఫలితమే జీడీపీ ఏప్రిల్‌-జూన్‌లో 23.9 శాతం, సెప్టెంబరు త్రైమాసికంలో 7.5 శాతం క్షీణతను నమోదు చేసింది..'కరోనా' వ్యాధిగ్రస్తులకు చికిత్సలు చేయాల్సిన ఒత్తిడి ఆస్పత్రుల మీద పెరిగిపోగా, అవసరమైన ఔషధాలు, టీకాలు అభివృద్ధి చేయడం ఫార్మా కంపెనీల పని అయింది.

'కరోనా' వల్ల పారాసెట్మాల్‌, అజిత్రోమైసిన్‌, విటమిన్లు, యాంటీ-బయాటిక్‌ ఔషధాలకు గిరాకీ బాగా పెరిగింది. మలేరియా వ్యాధిని అదుపు చేసే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ (హెచ్‌సీక్యూ) ఔషధం 'కరోనా' వైరస్‌ను నిరోధిస్తుందనే అభిప్రాయం తొలుత వ్యక్తం కావటంతో, ఈ ఔషధ వినియోగం ప్రపంచ వ్యాప్తంగా బాగా పెరిగింది. ఒక దశలో దేశీయ అవసరాలను పరిగణనలోకి తీసుకొని ఈ ఔషధాల ఎగుమతులను ప్రభుత్వం నిషేధించినా, కొంతకాలం తర్వాత తొలగించింది. ఇప్కా లేబొరేటరీస్‌, సిప్లా, గ్లెన్‌మార్క్‌, జైడస్‌ క్యాడిలా, గ్రాన్యూల్స్‌ ఇండియా.. తదితర కంపెనీలు ఈ ఔషధాల తయారీ- పంపిణీలో క్రియాశీలక పాత్ర పోషించాయి.

కరోనా చికిత్సకు 2 ఔషధాలు తేవడంలో..

జూన్‌- జులై నాటికి రెండు కొవిడ్‌-19 ఔషధాలు ఫావిపిరవిర్‌, రెమ్‌డిసివిర్‌లను అందుబాటులోకి తీసుకురావడంలో దేశీయ ఫార్మా కంపెనీలు క్రియాశీలక పాత్ర పోషించాయి. ఫావిపిరవిర్‌ జపాన్‌కు చెందిన ఫ్యూజీ ఫిల్మ్‌ కార్పొరేషన్‌ ఔషధం. అక్కడ ఇన్‌ఫ్లుయంజా వ్యాధిని అదుపు చేయడానికి వినియోగిస్తారు. ఒక మోస్తరు నుంచి మధ్యస్థాయి కొవిడ్‌-19 రోగులకు ఈ ఔషధం సత్వరం ఉపశమనం కలిగిస్తుందని తేలడంతో, దీన్ని మనదేశంలో తొలుత గ్లెన్‌మార్క్‌ ఫార్మా అందుబాటులోకి తెచ్చింది. తదుపరి ఇతర కంపెనీలు పెద్దఎత్తున ఈ ఔషధాన్ని తయారు చేసి, దేశీయంగా అందించడమే కాక రష్యా, గల్ఫ్‌ దేశాలకు ఎగుమతి చేశాయి. రెమ్‌డెసివిర్‌ను అమెరికా కంపెనీ గిలీడ్‌ సైన్సెస్‌ ఆవిష్కరించగా, దీన్ని వెనువెంటనే మనదేశానికి తీసుకురావడంలో హెటిరో, సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్‌, మైలాన్‌ ల్యాబ్స్‌ కీలక పాత్ర పోషించాయి.

వ్యాక్సిన్‌ కోసం ప్రపంచ దేశాల చూపు భారత్‌ వైపు

కొవిడ్‌ రాకుండా నిరోధించడానికి టీకా ఆవిష్కరణపై దేశీయ ఫార్మా/ బయోటెక్‌ కంపెనీలు దృష్టి సారించి, విజయం దిశగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ ‘కొవాగ్జిన్‌’ టీకా తయారు చేస్తుంటే, ఇతర కంపెనీలు విదేశీ భాగస్వామ్యాలతో కొవిడ్‌- 19 టీకా అభివృద్ధి చేశాయి. ఇందులో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌, అరబిందో ఫార్మా, జైడస్‌ క్యాడిలా ఉన్నాయి. విదేశీ ఫార్మా సంస్థలైన ఫైజర్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, మొడెర్నా, స్పుత్నిక్‌-వి వంటి సంస్థలు ఆవిష్కరించిన టీకా మనదేశంలో తయారు కావడం లేదా అందుబాటులోకి రావటం.. వంటి సానుకూలతలు కనిపించనున్నాయి. ఆస్ట్రజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ టీకాను మనదేశంలో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేస్తోంది. రష్యాకు చెందిన స్పుత్నిక్‌- వి టీకాను మనదేశంలో విక్రయించడానికి డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ టీకాలపై ప్రస్తుతం రెండు/ మూడో దశ పరీక్షలు జరుగుతున్నాయి. 2021 జూన్‌లోపు ఈ టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌, భారత్‌ బయోటెక్‌ సంస్థలు తమ టీకాలకు 'అత్యవసర వినియోగ అనుమతి' ఇవ్వాలని భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) వద్ద దరఖాస్తు చేశాయి. రెండు దశల్లో నిర్వహించిన పరీక్షల సమాచారాన్ని ఈ సంస్థలు అందజేశాయి. మూడో దశ పరీక్షల్లో ప్రాథమికంగా తేలిన విషయాలను కూడా నివేదించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ టీకాలకు అనుమతి ఇచ్చే అంశాన్ని డీసీజీఐ పరిశీలిస్తోంది. నూతన సంవత్సర కానుకగా, కొత్త ఏడాది తొలి రోజునే ఈ టీకాలకు అనుమతి లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. టీకా అందుబాటులోకి వస్తే, చాలావరకు జనజీవితం సాధారణ స్థితికి చేరుతుంది. మొత్తంమీద 'కరోనా' వంటి ప్రపంచ స్థాయి ముప్పునకు దేశీయ ఫార్మా/ బయోటెక్‌ కంపెనీలు అసాధారణ రీతిలో స్పందించి ప్రజలకు అండగా నిలిచాయి. కొత్త సంవత్సరంలో టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఏర్పడిందంటే ... అది కూడా, దేశీయ కంపెనీల సత్తానే. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు టీకా కోసం మనదేశం వైపు చూస్తున్నాయి. ఎందుకంటే ప్రపంచ టీకా తయారీ సామర్థ్యంలో మూడొంతులకు పైగా మనకే ఉంది. అందుకే భారత్‌లో తయారైన టీకానే కొత్త ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా సరఫరా కాబోతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.