ETV Bharat / business

మూడో త్రైమాసికంలో డీమార్ట్​కు లాభాల పంట - dmart market rise

మూడో త్రైమాసికంలో డీమార్ట్ లాభాలబాట పట్టింది. డిసెంబర్​తో ముగిసిన క్యూ3లో ఆదాయం రూ.7,432.69 కోట్లకు పెరిగింది. ఈ మేరకు వివరాలను వ్యాపారాన్ని నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్​మార్ట్స్​ లిమిటెడ్ వెల్లడించింది.

damani, q3, dmart
అదరగొట్టిన డీమార్ట్‌.. ₹447 కోట్ల లాభం
author img

By

Published : Jan 9, 2021, 9:31 PM IST

డీమార్ట్‌ పేరిట రిటైల్‌ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ లిమిటెడ్‌ మూడో త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.446.95 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని పొందింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.384.01 కోట్లు కావడం గమనార్హం. ఈ లెక్కన నికర లాభం 16.39 శాతం మేర పెరిగినట్లు బీఎస్‌ఈ ఫైలింగ్‌లో అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ పేర్కొంది.

సమీక్షిస్తున్న త్రైమాసికంలో ఆపరేషన్స్‌ ద్వారా 10.77 శాతం వృద్ధితో రూ.7,542 కోట్ల ఆదాయం సముపార్జించినట్లు అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.6,808.93 కోట్లు కావడం గమనార్హం. ఇదే కాలంలో రూ.6,977.88 కోట్లు ఖర్చులుగా కంపెనీ చూపించింది. స్టాండ్‌లోన్‌ పద్ధతిలో కంపెనీ నికర లాభం 19.27 శాతం వృద్ధితో రూ.470.25 కోట్లకు చేరగా.. ఆదాయం రూ.7,432.69 కోట్లు వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. కొవిడ్‌-19 అనంతరం ఊహించిన దానికంటే వినియోగం పెరిగిందని, పండగ అమ్మకాలు కలిసి రావడంతో కంపెనీ వ్యాపారం వృద్ధి చెందిందని అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ సీఈవో, ఎండీ నివెల్లీ నోరోన్హా ఫలితాలను ఉద్దేశించి అన్నారు.

ఇదీ చదవండి : అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిగా పళనిస్వామి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.