ETV Bharat / business

దివీస్​ నుంచి కొవిడ్-19 ఔషధాల తయారీ విధానాల అభివృద్ధి - హైదరాబాద్​ దివీస్​ లేబరేటరీస్​ లేటెస్ట్​ వార్తలు

హైదరాబాద్‌కు చెందిన దివీస్‌ లేబొరేటరీస్‌ కరోనా బాధితులకు చికిత్సలో వినియోగిస్తున్న ఫావిపిరవిర్‌, రెమ్‌డెసివిర్‌ ఔషధాల తయారీ విధానాలను (ప్రాసెస్‌) అభివృద్ధి చేస్తూ కీలకమైన ప్రగతి సాధించింది. మార్కెట్లో ఈ ఔషధాలకు ఉన్న డిమాండ్‌ ప్రకారం వెంటనే వీటిని తయారు చేసి, సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

corona medicines by divis laboratories
దివీస్​ నుంచి కొవిడ్-19 ఔషధాల తయారీ విధానాల అభివృద్ధి
author img

By

Published : Sep 15, 2020, 7:38 AM IST

కొవిడ్‌-19 ఔషధాలకు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన దివీస్‌ లేబొరేటరీస్‌ కీలకమైన ప్రగతి సాధించింది. బల్క్‌ ఔషధాలు, ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్స్‌) తయారీలో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ కరోనా బాధితులకు చికిత్సలో వినియోగిస్తున్న ఫావిపిరవిర్‌, రెమ్‌డెసివిర్‌ ఔషధాల తయారీ విధానాలను (ప్రాసెస్‌) అభివృద్ధి చేసింది. ఈ సంస్థ ఆవిష్కరించిన ప్రాసెస్‌ల ప్రకారం ఈ ఔషధాల తయారీకి ముడిపదార్ధాలను దిగుమతి చేసుకోవాల్సిన పనిలేదు. స్వతంత్ర ముడిపదార్ధాలతోనే ఈ మందులు తయారు చేయవచ్చు. దీనికి అనువైన తయారీ విధానాలను ఆవిష్కరించినట్లు, దివీస్‌ లేబొరేటరీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మురళి కె.దివి సోమవారం కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో వెల్లడించారు. మార్కెట్లో ఈ ఔషధాలకు ఉన్న డిమాండ్‌ ప్రకారం వెంటనే వీటిని తయారు చేసి, సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

ఫావిపిరవిర్‌ ఔషధాన్ని ఒక మోస్తరు నుంచి మధ్య స్థాయి కోవిడ్‌-19 లక్షణాలతో బాధపడుతున్న వారికి త్వరగా ఉపశమనం కలిగించటం కోసం వైద్యులు సిఫార్సు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక రెమ్‌డెసివిర్‌ ఔషధాన్ని కొవిడ్‌-19 వ్యాధి మరీ విస్తరించి న్యూమోనియాగా మారి ఆస్పత్రుల పాలైన రోగులకు ఇస్తున్నారు. రెమ్‌డెసివిర్‌ ఔషధానికి సంబంధించి అత్యంత సంక్లిష్టమైన నాలుగు ‘ఇంటర్మీడియేట్స్‌’ తయారీకి అనువైన ‘ప్రాసెస్‌’ లను ఆవిష్కరించినట్లు మురళి కె.దివి తెలిపారు.

ఈ మందులే కాకుండా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ (హెచ్‌సీక్యూ) ఔషధం తయారీ విధానాన్ని అభివృద్ధి చేసినట్లు ఆయన వెల్లడించారు. అలాగే చౌటుప్పల్‌, చిప్పాడ (విశాఖపట్టణం) వద్ద తమ యూనిట్లలో చేపట్టిన విస్తరణ కొంత మేరకు పూర్తయినట్లు, ఈ కొత్త యూనిట్లలో తయారీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని ఆయన తెలిపారు. నమూనా ఔషధాలు (క్వాలిఫికేషన్‌ బ్యాచెస్‌) తయారు చేసి అనుమతులు కోసం పంపినట్లు వెల్లడించార

ఇదీ చూడండి: వ్యవసాయ బిల్లులపై రైతులకు కేంద్రం భరోసా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.