ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కార్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఒక్కోకారుపై సుమారు రూ. 65వేలకు పైగా డిస్కౌంట్‌ను ఇస్తోంది. ఈ డిస్కౌంట్లు ఏప్రిల్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది. స్పెషల్ డిస్కౌంట్లతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఇస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సంస్థ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది.
చిన్న కార్లపై ఆఫర్లు ఇలా..
చిన్న కార్లపై రూ.25 వేల వరకు ఆఫర్ ప్రకటించింది టాటా మోటార్స్. టాటా టియాగో కొత్త కారు కొనేవారికి డిస్కౌంట్ ఆఫర్ కింద రూ.15వేలు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.10 వేలు తగ్గనుంది.
టాటా టిగోర్ కార్లపై సుమారు రూ.30వేల డిస్కౌంట్ లభించనుంది. నెక్సాన్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలోని డీజల్ వేరియంట్‌ను ఎంచుకునే వినియోగదారులకు రూ.15వేల ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది.

ఎస్‌యూవీలపై రూ.65వేల ఆఫర్..
5సీటర్ ఎస్యూవీ హ్యారియర్‌పై రూ.65వేలకు పైగా ఆఫర్ ఇస్తోంది టాటా మోటార్స్. అయితే ఇదే ఆఫర్ డార్క్ ఎడిషన్‌లోని ఎక్స్జెడ్ ప్లస్, ఎక్స్జెడ్ఏ ప్లస్ వేరియంట్లపై కేవలం రూ.40 వేల వరకే ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది సంస్థ.


ఇదీ చూడండి: 4 గంటల ఛార్జింగ్‌తో 120 కి.మీ. 'బైక్' ప్రయాణం