రానున్న కొన్నేళ్లలో దేశంలో డిజిటల్ చెల్లింపులు శీఘ్రగతిన పెరగనున్నాయని ఏసీఐ వరల్డ్‌వైడ్ నివేదిక వెల్లడించింది. 2025 నాటికి మొత్తం చెల్లింపుల్లో డిజిటల్ చెల్లింపుల వాటా 71.7 శాతానికి పెరగనుందని తెలిపింది. నగదు, చెక్‌ల రూపంలో జరిగే చెల్లింపులు కేవలం 28.3 శాతానికి పరిమితం అవుతాయని పేర్కొంది.
2020లో 25.5 బిలియన్ల రియల్ టైమ్ చెల్లింపు లావాదేవీలతో భారత్.. చైనా కంటే ముందుందని ఏసీఐ నివేదిక ద్వారా స్పష్టమైంది. ఈ సంఖ్య చైనాలో 15.7 బిలియన్లు మాత్రమే ఉంది. 2020లో భారత్‌లో ఎలక్ట్రానిక్ రిటైల్ చెల్లింపులు 15.6 శాతం, ఇతర ఎలక్ట్రానిక్ చెల్లింపులు 22.9 శాతం, కాగితం ఆధారిత చెల్లింపులు 61.4 శాతం ఉన్నట్లు తెలిసింది.
2025 నాటికి ఎలక్ట్రానిక్ రిటైల్ చెల్లింపులు 37.1 శాతం, ఇతర ఎలక్ట్రానిక్ చెల్లింపులు 34.6 శాతం, నగదు, లేదా ఇతర కాగితం ఆధారిత చెల్లింపులు 28.3 శాతం ఉంటాయని ఏసీఐ వెల్లడించింది.
ఇదీ చదవండి: పోస్టాఫీస్‌లో అంతకుమించి విత్‌డ్రా చేస్తే టీడీఎస్!