ETV Bharat / business

డిజిటల్​ కానుకలతో వేడుక సరికొత్తగా చేసుకోండి - Digital gift

లాక్​డౌన్​ అమలు కావడం వల్ల అందరూ ఇళ్లకే పరిమితవయ్యారు. ఈ నేపథ్యంలో బంధువులు, స్నేహితులకు సంబంధించిన శుభకార్యాలకు వెళ్లలేక పోతున్నారా? కనీసం బహుమతి కూడా పంపలేక చింతిస్తున్నారా? లాక్​డౌన్​ వేళ ప్రియమైన వారికి ఓ కొత్త అనుభూతిని అందించేందుకు డిజిటల్​ కానుకలు అందుబాటులోకి వచ్చాయి. ఇంతకీ డిజిటల్ కానుకలు అంటే ఏంటో తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది చదవండి.

Digital gift options to keep you happy during lockdown
లాక్​డౌన్​లో డిజిటల్​ బహుమతులు అందించి సర్​ఫ్రైజ్​ చేసేయండి!
author img

By

Published : Apr 19, 2020, 3:28 PM IST

లాక్​డౌన్​ ప్రజలందరినీ ఇళ్లకే పరిమితం చేసింది. ఈ సమయంలో జరిగే శుభకార్యాలకు హాజరుకావడం కష్టమైన పనే. అయితే స్వీయ నిర్బంధంలో ఉన్నా సరే పుట్టిన రోజులు, వార్షికోత్సవాలు, ఇతరత్రా ప్రత్యేక రోజులను మరింత ప్రత్యేకంగా జరుపుకునేందుకు డిజిటల్​ వేదిక సిద్ధమైంది.

ఇంట్లోనే ఉండి ఇష్టమైన వారిని ఆశ్చర్య పరిచేందుకు డిజిటల్​ కానుకలు అందుబాటులోకి వచ్చాయి. వీడియో కాల్​లో గిటారిస్ట్​తో సరికొత్తగా గిటారు వాయించడం, ప్రత్యేకంగా అవతలి వ్యక్తికి చెప్పాలనుకున్న భావాలను వీడియో సందేశం ద్వారా అందించడం, ఈ- స్టోరీ పుస్తకాలు, ఇతర డిజిటల్​, వర్చువల్​ కానుకలను ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తోంది 'ఫెర్న్స్​ ఎన్​ పెటల్స్' అనే ఆన్​లైన్​ పూల విక్రయ సంస్థ.

ప్రత్యేక సంగీతం వారి కోసమే

ప్రస్తుతం దగ్గరుండి ఇష్టమైన వారికి సంబంధించిన వేడుకలు నిర్వహించలేనందున వీడియో కాల్​ ద్వారా కానుకలను అందజేయవచ్చు. వీడియో కాల్​లో గిటారు వాయించి ఆశ్చర్యపరచవచ్చు. దీని వల్ల అవతలి వ్యక్తి ఆనంద పడటమే కాకుండా, అతడి మానసిక స్థితి మెరుగుపడుతుంది. ప్రస్తుత ఒత్తిడి జీవితాల్లో ఈ రకమైన కానుకలు ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తాయి. కానుక ఇవ్వాలి అనుకున్న వారి ఎంపికను బట్టి గిటారు వాయించే వ్యక్తి 10 నుంచి 30 నిమిషాల పాటు గిటారు వాయిస్తారు. అంతే కాకుండా ​ఏ పాటలను ప్లే చేయాలో కూడా మనమే జాబితాను అందించవచ్చు.

లాక్​డౌన్​తో సంబంధం లేకుండా..

ఈ ' పర్సనలైజ్డ్​ వీడియో మెసేజ్​' ద్వారా లాక్​డౌన్​ సమయంలోనే కాకుండా సాధారణ సమయంలోనూ డిజిటల్ కానుకను అందించవచ్చు. ఎవరికైతే ప్రత్యేక కానుక ఇవ్వాలనుకుంటామో.. మనం చెప్పాలనుకున్న సందేశాన్ని, వారి ఫొటోలను టెక్ట్స్​బాక్స్​లో జోడిస్తే చాలు. తర్వాత రూపుదిద్దుకున్న పాటతోపాటు చిత్రాలతో సర్​ఫ్రైజ్​ ఇవ్వొచ్చు.

" ప్రస్తుత పరిస్థితుల్లో డిజిటల్​ కానుకలు మీ అభిమాన వ్యక్తుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇష్టమైన వారు ఎంత దూరంగా ఉన్నా వారికి మంచి అనుభూతిని అందించవచ్చు. ఇది వారి జీవితంలోనే ఓ తీపి జ్ఞాపకం అవుతుంది. అలాగే ఇలాంటి కష్టమైన సమయాల్లో పోరాటాన్ని పోరడటానికి ఈ రకమైన సంగీతం ఎంతో ఉపయోగపడుతుందని నమ్ముతున్నా. "

- పవన్​ గాడియా, సీఈవో, ఫెర్న్స్ ఎన్ పెటల్స్​

పిల్లల కోసం ప్రత్యేకంగా..

Digital gift options to keep you happy during lockdown
లాక్​డౌన్​లో డిజిటల్​ బహుమతులు అందించి సర్​ఫ్రైజ్​ చేసేయండి!

పిల్లల కోసం డిజిటల్​ కానుకల్లో భాగంగా ఈ-స్టోరీ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. వారు చదివిన కథల్లోని హీరోల ఫొటోల స్థానంలో మీ పిల్లల ఫొటోలను పొందుపర్చవచ్చు. తద్వారా పిల్లలకు అంతులేని ఆనందాన్ని అందించవచ్చు.

ఇదీ చదవండి: ఆ రాష్ట్రాలను కరోనా నుంచి కాపాడిన 'పౌర' నిరసనలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.