కాస్త అలసటగా అనిపించినా ఛాయ్ తాగాలని కోరుకుంటాం. ఎందుకంటే అతి తక్కువ ఖర్చులో ఏదో తెలియని ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఛాయ్‌కు బానిసైన వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇందులో అసోం టీకి ఉన్న క్రేజే వేరు.
అక్కడి కంపెనీలు తయారు చేసే టీ పొడికి మంచి డిమాండ్ ఉంది. ఎంతలా అంటే... డికోమ్ అనే టీ కంపెనీ తయారు చేసిన గోల్డెన్ బటర్ ఫ్లై టీ పొడి కేజీకి వేలంలో రూ.75 వేలు పలికింది.
అసోం దిబ్రూగఢ్‌లోని 'డికోమ్ టీఈ రాస్సెల్' అనే కంపెనీ తయారు చేసిన ఈ టీ పొడి గత రికార్డులను బద్దలుగొట్టింది. ఇటీవలే గువహటిలోని మైజాన్ టీ రూ.70,501 పలికింది.
తకుముందు మానుహరి గోల్డ్ టీ కిలోకు రూ.50 వేలు రాబట్టుకుంది. అంతకుమించిన స్థాయిలో అమ్ముడుపోయింది గోల్డెన్ బటర్ ఫ్లై టీ.
"గోల్డెన్ బటర్‌ఫ్లై టీ పొడి కేజీకి రూ.75వేలు పలికింది. ఇదో ప్రపంచ రికార్డు. మా తోటలో 12.5 లక్షల కేజీల టీ తయారు చేస్తాం. ఇదొక కేజీ మాత్రమే. మొత్తంగా టీ పరిశ్రమ పరిస్థితి అంత బాగా లేదు. అయితే ఇలాంటి రికార్డులతో స్ఫూర్తి కలుగుతుంది. మేం మంచి టీని తయారు చేసేలా ఆసక్తి పెరుగుతుంది."
-డికోమ్ టీ కంపెనీ యజమాని
ఎందుకింత ప్రత్యేకం?
ఈ టీ పొడికి ఇంత డిమాండ్ ఉండటానికి కారణం అరుదుగా దొరకటమే. దీని తయారీ ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. ఏడాదిలో ఏదో ఒక సమయంలో ప్రత్యేక జాతికి చెందిన సీతాకోక చిలుకలు తోటల్లో వాలతాయి. ఆ సమయంలో తయారు చేస్తేనే ఇంతటి నాణ్యమైన టీ పొడి లభిస్తుంది. అందుకే దీనికి గోల్డెన్ బటర్‌ఫ్లై అనే పేరు వచ్చింది. అయితే ఆ సమయాన్ని మనం గుర్తిస్తేనే ఈ టీ తయారీ సాధ్యమవుతుంది.
ఇదీ చూడండి: రికార్డు ధర పలికిన అసోం వెరై'టీ'