ETV Bharat / business

ఆభరణాల గిరాకీ 35% వృద్ధి!

ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటున్న వేళ.. ప్రజలు ఆభరణాల కొనుగోళ్లకు మొగ్గుచూపుతారని ఇండియా రేటింగ్స్ సంస్థ అంచనా వేసింది. 2020-21లో బంగారు ఆభరణాలకు 35 శాతం గిరాకీ పెరగొచ్చని తన‌ నివేదికలో వెల్లడించింది. అదే విధంగా పసిడి ధరలు తగ్గుతుండటమూ ఒక కారణంగా పేర్కొంది.

Demand to ornaments may increase by next year
బంగారు ఆభరణాలకు 35 శాతం గిరాకీ!
author img

By

Published : Mar 19, 2021, 7:30 PM IST

పసిడి ధరలు గతేడాది గరిష్ఠస్థాయుల నుంచి గణనీయంగా తగ్గినందున, ఆభరణాల గిరాకీలో వృద్ధి కొనసాగుతుందని ఇండియా రేటింగ్స్‌ నివేదిక అంచనా వేస్తోంది. 2020-21తో పోలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో 30-35 శాతం మేర గిరాకీ పెరగొచ్చని తెలిపింది. ఆర్థిక కార్యకలాపాలు కొవిడ్‌-19 ముందు స్థాయులకు చేరడం కూడా ఇందుకు దోహదం చేస్తుందని పేర్కొంది. పండుగ సీజనుకు తోడు వివాహాది శుభకార్యాలు జరగడం, గరిష్ఠ స్థాయి నుంచి బంగారం ధర 10 శాతం మేర తగ్గడంతో గత అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో ఆభరణాలకు గిరాకీ బలంగా పుంజుకుందని అభిప్రాయపడింది. ఆభరణాల రంగం రేటింగ్‌ను 'స్థిరత్వం- ప్రతికూలం' నుంచి స్థిరత్వానికి సవరించింది. కొవిడ్‌-19 ప్రత్యేక పరిస్థితుల కారణంగా గిరాకీ గణనీయంగా పడిపోవడం వల్ల, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 2021-22లో గిరాకీలో బలంగా పుంజుకుంటుందని నివేదిక పేర్కొంది. పసిడి ధరలు మరింత తగ్గుతుండటం కలిసిరావచ్చని తెలిపింది. అయితే 2019-20తో పోలిస్తే 2021-22 గిరాకీలో వృద్ధి 5-10 శాతమే ఉండొచ్చని వెల్లడించింది.

పెరిగిన నిర్వహణ మార్జిన్లు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు త్రైమాసికాల్లో దిగ్గజ ఆభరణాల విక్రయ సంస్థల నిర్వహణ మార్జిన్లు 7.7% పెరిగాయని, 2019-20 ఇదే సమయంలో ఇది 5.9 శాతమేనని నివేదిక పేర్కొంది. ప్రచారాల వ్యయాలు తగ్గడం ఇందుకు తోడ్పడిందని తెలిపింది. అద్దె సహా నిర్వహణ వ్యయాలు తగ్గడం 2021-22లో మార్జిన్ల వృద్ధికి దోహదం చేయొచ్చని పేర్కొంది. 2019-20 స్థాయితో పోల్చినా 25-50 బేసిస్‌ పాయింట్ల మేర మార్జిన్లు పెరగొచ్చని నివేదిక అంచనా వేసింది. చాలా సంస్థలు కొత్త విక్రయ కేంద్రాల ప్రారంభాన్ని 2022-23కి వాయిదా వేసుకున్నాయని, తక్కువ లాభదాయకత ఉన్న విక్రయకేంద్రాలను విలీనం చేస్తున్నాయని తెలిపింది. గిరాకీ పుంజుకోడానికి తోడు కొత్త విక్రయకేంద్రాలను పెద్దగా ప్రారంభించరు కనుక 2021-22లో ఆభరణాల రంగానికి వ్యయాల రూపేణ కలిసొస్తుందని పేర్కొంది.

ఇవీ చదవండి: దిగొస్తున్న బంగారం ధర- కారణమిదే?

పెట్టుబడికి బంగారు బాట 'పసిడి బాండ్లు'

బంగారంపై రుణమా?.. ఇవి గుర్తుంచుకోండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.