ETV Bharat / business

ట్రూకాలర్ నుంచి మీ ఫోన్​ నంబర్​ తొలగించండిలా.. - ట్రూకాలర్​లో ఫోన్​నంబర్ అన్​లిస్ట్ చేయడం ఎలా?

ట్రూకాలర్​ ద్వారా మీ గోప్యతకు ప్రమాదం ఉందని భావిస్తున్నారా? అయితే ఈ యాప్​ నుంచి మీ ఫోన్ నంబర్​ను అన్‌లిస్ట్ చేయడమే మేలు అంటున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకోండిలా..

Truecaller
ట్రూకాలర్​
author img

By

Published : Jul 20, 2021, 3:15 PM IST

స్మార్ట్​ఫోన్​లో తప్పనిసరిగా ఉపయోగించే యాప్​లలో 'ట్రూకాలర్' ఒకటి. కొత్త నంబర్​ నుంచి వచ్చిన ఫోన్​ కాల్​కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ఉపయోగపడే ఈ యాప్​కు ప్రపంచంలో భారీ సంఖ్యలో వినియోగదారులున్నారు. యూజర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ ఐడీలు, లొకేషన్ సమాచారం సహా ఇతర డేటా ట్రూకాలర్ సర్వర్‌లలో ఉంటుంది. అయితే.. ఇంత మొత్తంలో డేటా ఉండటం.. ఈ సాంకేతిక యుగంలో ఎప్పటికైనా ప్రమాదమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో.. వ్యక్తిగత సమాచారాన్ని సెర్చ్ చేయగలిగే అవకాశం ఉన్న డేటాబేస్ నుంచి ఫోన్​ నంబర్​ను తొలగించడం లేదా అన్‌లిస్ట్ చేయడం ద్వారా డేటాను రక్షించుకోవచ్చని అంటున్నారు. దీనికోసం కంపెనీని రిక్వెస్ట్ చేయవచ్చని సూచిస్తున్నారు.

ఫోన్ నంబర్‌ డీ-లిస్టింగ్ ఇలా..

మొదటి దశ: ట్రూకాలర్‌ యాప్​ను ఓపెన్ చేసి.. పైన ఎడమ వైపున ఉన్న మెనూపై క్లిక్ చేసి సెట్టింగ్స్​లోకి వెళ్లాలి.

సెట్టింగ్స్​ మెనూలో.. ప్రైవసీ సెంటర్​ ఆప్షన్​ను క్లిక్​ చేయాలి. ఆ తరువాతి పేజీలో డీయాక్టివేట్​ ఆప్షన్​ను ఎంచుకోవాలి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటికీ ఇదే ప్రక్రియ.

అయితే.. ట్రూకాలర్ వినియోగదారులు కాకపోతే.. అన్​లిస్ట్​ చేయలేరు.

రెండోదశ: అన్​లిస్టింగ్ రిక్వెస్ట్ కోసం ట్రూకాలర్ వెబ్​ పేజీని ఓపెన్ చేయాలి. ఇండియా కోడ్(+91) కోడ్‌తో మొబైల్ నంబర్‌ను నమోదు చేసి.. అన్‌లిస్ట్ ఫోన్ నంబర్ బటన్‌పై క్లిక్ చేయాలి. 24 గంటల్లో కంపెనీ నుంచి మీ ఫోన్ నంబర్ అన్​లిస్ట్ అయినట్లు ఓ సందేశం వస్తుంది.

నిర్ధరణ..

ట్రూకాలర్ డేటాబేస్ నుంచి మీ ఫోన్ నంబర్ తొలగించారా? లేదా? అని 24 నుంచి 48గంటల్లో తనిఖీ చేసుకోవాలి. రిక్వెస్ట్ పెట్టినప్పటికీ మీ నంబర్​ను ఎవరైనా సెర్చ్ చేస్తున్నారంటే.. మీ ప్రొఫైల్​ ఇతరుల వద్ద సేవ్ అయి ఉండొచ్చు. అందువల్ల మీ ఫోన్​ సెట్టింగులు, యాప్​లు, ట్రూకాలర్ మెమోరీని క్లియర్ చేయాలి.

డిజిటల్ గోప్యత!

అన్​లిస్టింగ్ లేదా డీలిస్టింగ్ ద్వారా ఏదైనా కాల్ వచ్చినప్పుడు మీ సమాచారం వినియోగదారులకు చూపించకుండా ఉండదని కాదు. అయితే.. 'సెర్చ్​ చేయగలిగే డేటాబేస్’ నుంచి మీ నంబర్ తొలిగిపోతుంది. అంటే ఇతరులు మన నంబర్​ను శోధించినప్పటికీ.. మన సమాచారాన్ని పొందలేరు.

ట్రూకాలర్ యూజర్లు కానప్పటికీ పైన సూచించిన ప్రక్రియను ఓసారి చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.