ETV Bharat / business

కరోనా పేరుతో సైబర్​ మోసాలు- ఈ జాగ్రత్తలు తప్పనిసరి...

author img

By

Published : Mar 28, 2020, 2:48 PM IST

సైబర్​ మోసగాళ్లు రూటు మార్చారు. డబ్బులు దోచుకునేందుకు కరోనా వైరస్​నే సరికొత్త అస్త్రంగా మలుచుకున్నారు. వారి బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడే తెలుసుకోండి.

CORONA
కరోనా పేరుతో సైబర్​ మోసాలు- ఈ జాగ్రత్తలు తప్పనిసరి...

కరోనా.... యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న మహమ్మారి. వైరస్​ గురించి ప్రజల్లో నెలకొన్న భయాల్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కొందరు సైబర్​ నేరగాళ్లు. కొత్త రకం మోసాలతో జనాల్ని బుట్టలో పడేసి డబ్బులు దండుకుంటున్నారు. ఈ కష్టకాలంలో అలాంటి మోసగాళ్ల బారిన పడకుండా ఉండడం ఎంతో కీలకం.

కరోనా కాలంలో సరికొత్త మోసాలు:

ఆన్​లైన్​ మోసం: సైబర్​ దొంగలు నకిలీ వైబ్​సైట్లు, ఈ-కామర్స్​ ప్లాట్​ఫామ్స్​, సోషల్ మీడియా ఖాతాలు, ఈమెయిల్స్​ సృష్టిస్తారు. ఔషధాలు, వైద్య సామగ్రి పంపుతామని నమ్మబలుకుతారు. ఆన్​లైన్​ ద్వారా డబ్బులు చెల్లించమని అడుగుతారు.

టెలిఫోన్​ ఫ్రాడ్​: "మా బంధువు ఒకరికి కరోనా సోకింది. ఆస్పత్రిలో చేర్చాం. చికిత్స కోసం డబ్బులు కావాలి. మీరు సాయం చేయండి" అని అబద్ధం చెప్పి డబ్బులు కాజేస్తారు.

ఫిషింగ్​: మోసగాళ్లు... తాము ఆరోగ్యశాఖ అధికారులమని చెప్పుకుంటూ వైరస్​ గురించి మెయిల్స్​ పంపుతారు. అందులో నకిలీ వెబ్​సైట్ల లింక్​లు పెడతారు. ఈమెయిల్​ ఐడీ, పాస్​వర్డ్​తో లాగిన్​ అవ్వమని చెబుతారు. తెలియక లాగిన్​ అయితే.. ఆ వివరాలు తస్కరిస్తారు. మన బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు దోచుకుంటారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి:

  1. అనుమానాస్పద ఈమెయిల్స్​ ఓపెన్​ చేయకండి. కరోనా వైరస్​ గురించి అంటూ వచ్చే లింకులు, సోషల్ మీడియా మెసేజ్​లకు దూరంగా ఉండండి.
  2. సోషల్​ మీడియా, బ్యాంకు ఖాతాలకు స్ట్రాంగ్​ పాస్​వర్డ్​లు, మల్టీ లెవల్ అథెంటికేషన్​ ఆప్షన్​ పెట్టుకోండి.
  3. మీ సాఫ్ట్​వేర్​ ఎప్పటికప్పుడు అప్​డేట్​ చేసుకోండి. యాంటీ వైరస్​ సాఫ్ట్​వేర్​ ఉపయోగించండి.
  4. ఆన్​లైన్​లో సమాచార భద్రత గురించి మీ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మీ పిల్లలకు చెప్పండి.
  5. స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇచ్చే ముందు ఒకటికి రెండు సార్లు వివరాలు సరిచూసుకోండి.
  6. సైబర్​ మోసం బారిన పడితే తక్షణమే పోలీసులను సంప్రదించండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.