Crypto Tax India: క్రిప్టోకరెన్సీపై కేంద్రప్రభుత్వం పన్ను విధించినంత మాత్రాన.. వాటిని చట్టబద్ధం చేసినట్లు కాదని స్పష్టం చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వాటిపై నిషేధం విధించే అవకాశం లేకపోలేదని సంకేతాలిచ్చారు. బడ్జెట్‌పై రాజ్యసభలో జరిగిన చర్చకు ప్రభుత్వం తరఫున సమాధానం ఇచ్చిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు నిర్మల.
Cryptocurrency India
"ప్రస్తుతం క్రిప్టోకరెన్సీని చట్టబద్ధం చేయడం లేదు. అలాగని నిషేధించడం లేదు. దీనిపై ఓ కమిటీ సంప్రదింపులు జరుపుతోంది. నాకు నివేదిక రాగానే క్రిప్టోకరెన్సీని నిషేధించాలా లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటాం" అని స్పష్టం చేశారు నిర్మల.
30శాతం పన్ను...
క్రిప్టో కరెన్సీ లావాదేవీలతో వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను విధిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. క్రిప్టో కరెన్సీల ద్వారా కానుకలు పొందినా.. వాటికి 30 శాతం క్రిప్టో పన్ను వర్తిస్తుందన్నారు. ఈ పన్ను కానుక స్వీకరించినవాళ్లు చెల్లించాలని స్పష్టం చేశారు. పరిమితికి మించి చేసిన డిజిటల్ ఆస్తుల లావాదేవీలపై ఒక్క శాతం టీడీఎస్ విధింపు ఉంటుందని వివరించారు.
ఇదీ చదవండి: