కొవిడ్-19 పరీక్షలు, టీకా యాజమాన్య సేవలకు సంబంధించిన ఒక సాఫ్ట్ వేర్ సొల్యూషన్‌ను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఆవిష్కరించింది. 'ఇవి ఎంతో సంక్లిష్ట ప్రక్రియ ..ఎన్నో దశలు, పెద్ద సంఖ్యలో మానవ వనరుల ప్రమేయం ఉంటుంది. ఎవరెక్కడ ఎటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నారు, ఫలితాలు ఎలా ఉన్నాయనేది పర్యవేక్షించటం కష్టసాధ్యంగా ఉంటుంది. దీన్ని పరిగణనలోకి తీసుకొని కృత్రిమ మేధ (ఏఐ), రోబటిక్స్ బ్లాక్ చైన్, ఐఓటీ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మా సాంకేతిక భాగస్వామ్య సంస్థలతో కలిసి కొవిడ్-19 టెస్టింగ్, వ్యాక్సిన్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ సూట్ రూపొందించాం' అని టీసీఎస్ వెల్లడించింది.
కరోనా నిర్ధారణ, టీకా ప్రక్రియలో ఇమిడి ఉన్న అయిదు ముఖ్యమైన దశలైన... పరిశోధన- తయారీ, టీకా కేటాయింపు- రవాణా, నిల్వ- పంపిణీ, టీకా ఇచ్చే ప్రణాళికను సిద్ధం చేయడం- టీకా ఇవ్వటం, పర్యవేక్షణకు సంబంధించి ఎక్కడా అవాంతరాలు లేకుండా పని పూర్తి కావడానికి ఈ ఐటీ సూట్ దోహదపడుతుందని టీసీఎస్ వివరించింది. సూట్ వల్ల పారదర్శకత కూడా పెరుగుతుందని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: కబ్జాలు, మోసాలు, సెటిల్‌మెంట్ల మధ్య నలిగిపోతోంది వారే!