ETV Bharat / business

కొవిడ్​ పోరులో 'టాటా' ఆక్సిజన్​ సాయం - టాటా గ్రూప్​ క్రయోజెనిక్​ ట్యాంకర్లు

దేశంలో కరోనా రోగులకు మెరుగైన వసతులు కల్పించేదిశగా టాటా గ్రూప్​ సంస్థలు కీలక ముందడుగు వేశాయి. 400 ఆక్సిజన్​ ప్లాంట్లను నెలకొల్పేందుకు విదేశాల్లో ఉండే 60 క్రయోజెనిక్ ఆక్సిజన్​ ట్యాంకర్లను విమానాల ద్వారా భారత్​కు తీసుకురానున్నాయి.

Tata, cryogenic
కొవిడ్​ పోరులో 'టాటా' ఆక్సిజన్​ సాయం
author img

By

Published : May 5, 2021, 5:06 AM IST

కరోనాపై భారత్​ చేస్తున్న పోరాటానికి దేశంలోని బడా కంపెనీలు అండగా నిలుస్తున్నాయి. 400 ఆక్సిజన్ తయారీ యూనిట్​లను ఏర్పాటు చేసేందుకు విదేశాల్లో ఉన్న 60 క్రయోజెనిక్​ ఆక్సిజన్​ ట్యాంకర్లను విమానాల ద్వారా భారత్​కు తీసుకువచ్చేందుకు టాటా గ్రూప్ సన్నాహాలు చేస్తోంది. వీటి ద్వారా తయారు చేసిన ఆక్సిజన్‌ను చిన్న పట్టణాల్లోని ఆసుపత్రులకు అందజేస్తామని టాటా గ్రూప్ తెలిపింది.

టాటా గ్రూప్​ కంపెనీలతో కలిసి కొవిడ్ రోగుల కోసం సుమారు 5,000 పడకలను ఏర్పాటు చేస్తామని టాటా సన్స్​కు చెందిన ఓ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సంస్థలోని కొంత మంది ఉద్యోగులకు ఇందుకు సంబంధించిన శిక్షణ ఇచ్చి...భారత్​లోని కొన్ని హోటళ్లను కరోనా కేంద్రాలుగా మార్చినట్లు చెప్పారు. దీంతో రోగులకు మరిన్ని పడకలను అందుబాటులోకి తీసుకురావచ్చని వివరించారు. ఇందుకోసం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్​డీఓ)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు.

ఆక్సిజన్​ సరఫరా పెంపు..

కరోనా రోగుల చికిత్స కోసం వినియోగించే ఆక్సిజన్​ రోజువారీ సరఫరాను 1,000 టన్నులకు పెంచుతున్నట్లు టాటా స్టీల్ తెలిపింది. జెంషెడ్​పుర్​, కళింగనగర్​లోని ప్లాంట్ల నుంచి ఆక్సిజన్ సరఫరా పరిమితిని రోజుకు 600 టన్నుల నుంచి 800 టన్నులకు పెంచినట్లు పేర్కొంది. ఈ మేరకు ట్వీట్​ చేసింది.

ఇదీ చూడండి: కరోనాపై పోరులో కార్పొరేట్ల సాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.